Kiara Advani: చిరిగిన దుస్తుల్లో మహేశ్​ బాబు హీరోయిన్.. చూపించి చూపించనట్టుగా

తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన బాలీవుడ్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. సూపర్ స్టార్ మహేశ్​ బాబు సరసన భరత్​ అనే నేను సినిమాలో హీరోయిన్​గా కియారా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాల్లో దూసుకుపోతూ బాలీవుడ్​లో గోల్డెన్​ లెగ్​గా పిలిపించుకుంటుంది. ఎందుకంటే ఆమె నటించిన అన్ని హిందీ చిత్రాలు ఆల్​మోస్ట్​ మంచి విజయం సాధించాయి. సినిమాలే కాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటుంది. హాట్​ ఫొటోషూట్​తో ఘాటుగా అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. తాజాగా కియారా అద్వానీ పెట్టిన ఫొటోలను చూసి క్యా కియారే.. అంటూన్నారు నెటిజన్లు.

తగ్గిన అవకాశాలు..

తగ్గిన అవకాశాలు..

సూపర్ స్టార్ మహేశ్​ బాబుకు జోడీగా భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఆ తర్వాత రామ్​ చరణ్​తో వినయ విధేయ రామ చిత్రంలో ఆకట్టుకుంది. అయితే ఆ మూవీ అంతగా సక్సెస్ సాధించలేదు. దీంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. మళ్లీ తాను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే మకాం మార్చింది ఈ హిందీ భామ.

సంక్రాంతి కానుకగా..

సంక్రాంతి కానుకగా..

అయితే మళ్లీ రామ్​ చరణ్​ సరసనే ప్రముఖ డైరెక్టర్​ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్​ చేస్తున్నారు. ఇందులో గ్లామరే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్​లో కియా రా అద్వానీ నటించనుందని సమాచారం. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కియారా అద్వానీ సోషల్​ మీడియాలో కూడా ఫుల్​ యాక్టివ్​గా ఉంటుంది.

 అల్ట్రా గ్లామరస్​గా..

అల్ట్రా గ్లామరస్​గా..

అప్పుడప్పుడు గ్లామర్, హాట్​ ఫొటోలతో యూత్​ను అట్రాక్ట్​ చేస్తుంది కియారా అద్వానీ. విభిన్నమైన ఫొటోషూట్​లతో అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరోక ఫొటోషూట్​తో ఆకట్టుకుంది కియారా. స్టైలిష్​ వేర్​లో చూపించి చూపించనట్లుగా తన అందాలను అరకొరగా ప్రదర్శించింది. ఈ చిరిగిన దుస్తుల్లో అల్ట్రా గ్లామరస్​గా కనిపించింది కియారా అద్వానీ. ప్రస్తుతం ఈ పిక్స్​ వైరల్ అవుతున్నాయి.

ఫగ్లీ మూవీతో..

ఫగ్లీ మూవీతో..

కాగా కియారా అద్వానీ సినీ కెరీర్​ విషయానికొస్తే 2014లో వచ్చిన ఫగ్లీ చిత్రంతో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. అయితే కియారా అసలు పేరు అలియా అద్వానీ. అప్పటికే అలియా భట్​ హీరోయిన్​ ఉండటంతో తన పేరును కియారాగా మార్చాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్​ ఖాన్​. ఇక క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్​గా వచ్చిన ఎంఎస్ ధోని ది అన్​టోల్డ్​ స్టోరీ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది.

 యాక్టింగ్​కు మార్కులు..

యాక్టింగ్​కు మార్కులు..

అయితే ఈ భామ నెట్​ఫ్లిక్స్​ ఒరిజినల్స్​ చేసిన అంతాలజీ వెబ్​ సిరీస్​ లస్ట్​ స్టోరీస్​ చేసింది. ఈ సిరీస్​లో తన యాక్టింగ్​కు చాలా ప్రశంసులు దక్కాయి. ఓ గృహిణిగా ఉంటూనే బోల్డ్​నెస్​ యాక్టింగ్​కు బాలీవుడ్ ఫిదా అయింది. ఈ సిరీస్​లో కియారా అద్వానికి జోడిగా విక్కీ కౌశల్​ నటించాడు.

రూ. 200 కోట్ల గ్రాస్​..

రూ. 200 కోట్ల గ్రాస్​..

హిందీలో అర్జున్​ రెడ్డికి రీమేక్​గా వచ్చిన కబీర్ సింగ్​ సినిమాతో మరింత ఆకట్టుకుంది కియారా అద్వానీ. ఇందులో బాలీవుడ్ హీరో షాహిద్​ కపూర్​ నటించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల భూల్​ భులయ్యా 2 చిత్రంతో మంచి హిట్​ కొట్టింది. సుమారు రూ. 200 కోట్ల గ్రాస్​ను కలెక్ట్ చేసింది ఈ చిత్రం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X