‘అప్పటినుంచి నా జీవితం మారిపోయింది'.. రామ్ చరణ్ బ్యూటీ భావోద్వేగం..
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani). గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ మెప్పిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ భామ, ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చేసే వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కియారా 2014లో 'ఫగ్లీ'అనే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె, 2016లో వచ్చిన M.S. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కబీర్ సింగ్, భూల్ భూలయ్యా 2, సత్యప్రేమ్ కి కథ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే. భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాలతో టాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు పొందారు.

ఇక ప్రస్తుతం కియారా తన భారీ ప్రాజెక్ట్ టాక్సిక్ పై ఫోకస్ పెట్టారు. ఈ యష్ డబుల్ రోల్‌లో నటిస్తుండగా, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి స్టార్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ గ్యాస్టర్ డ్రామాలో కియారా 'నాడియా' అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. మొదట మార్చి 19న విడుదల చేయాలని భావించిన ఈ సినిమా, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా జూన్ 4కి వాయిదా పడింది. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు మరింత ఆసక్తిగా ఉన్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో తల్లిగా మారిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి కియారా వివరించారు. 'అమ్మనయ్యాక జీవితాన్ని చూస్తే నా కోణం పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూలో హైలైట్ అయిన విషయం 'నేను ఇప్పుడు ఒక ఆడపులిలా మారాను'అన్న వ్యాఖ్య. తన బిడ్డను రక్షించాలనే భావనతో తాను మరింత బలంగా, జాగ్రత్తగా మారానని కియారా సూచించింది. ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, చాలా మంది తల్లులు ఈ భావనతో కనెక్ట్ అవుతున్నారు.
తన వ్యక్తిగత జీవితం గురించి కూడా కియారా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో ఉన్న బంధం పెళ్లి తర్వాత కూడా పెద్దగా మారలేదని ఆమె చెప్పింది. 'మునుపటిలాగే మేము సరదాగా మాట్లాడుతాం, కలిసి ట్రావెల్ చేస్తాం, సినిమాలు చూస్తాం. అయితే పెళ్లి తర్వాత తమ సొంత ప్రపంచాన్ని నిర్మించుకోవడం ద్వారా మరింత స్వతంత్రంగా వచ్చిందని ఆమె అన్నారు.
కియారా - సిద్దార్థ్ ప్రేమకథ కూడా అభిమానులకు ప్రత్యేకమే. ఇద్దరూ షేర్షా సినిమా సమయంలో పరిచయమై ప్రేమలో పడి, 2023లో ఘనంగా వివాహం చేసుకున్నారు. 2025లో తమ ప్రెగ్నెన్సీని ప్రకటించారు, అదే ఏడాది జూలైలో తమ కుమార్తె సరాయా మల్హోత్రాకు జన్మనిచ్చారు. ఆ తర్వాత నవంబర్‌లో ఆమె పేరు వెల్లడిస్తూ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. మొత్తంగా చూస్తే, కియారా మాతృత్వంతో జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications



















