twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లిప్‌లాక్స్ సీన్స్‌లో రెచ్చిపోయిన కియారా.. బోల్డ్‌గా అంతకుమించి

    |

    అప్పట్లో ఏదో ఒక సినిమాలో సన్నివేశాన్ని బట్టి ఎక్కడో ఒక లిప్‌లాక్ ఉంటేనే సెన్సేషన్ అయ్యేది. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో లిప్‌లాక్స్ సీన్స్‌ లేని షాట్ ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు. యూత్‌ని అట్రాక్ట్ చేసేలా అడల్ట్ కంటెంట్‌తో సినిమాలు చేసేందుకే మక్కువ చూపుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ కోవలోనే టాలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలైన అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ వద్ద నానా హంగామా చేసింది. ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్ కియారా అద్వానీ ముద్దుల్లో మునిగి తేలుతూ నటించిందట.

    మళ్లీ అదే డైరెక్టర్

    మళ్లీ అదే డైరెక్టర్

    టాలీవుడ్‌లో మొదటి సినిమా అర్జున్ రెడ్డి తోనే తన దర్శకత్వంలో ఓ ప్రత్యేకత ఉందని నిరూపించి ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రంలో హీరో హీరోయిన్‌తో రొమాంటిక్ సన్నివేశాలు రక్తి కట్టించేలా రూపొందించి యూత్‌ని బాగా ఆకట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఆయనే అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

     జోష్‌లో రెచ్చిపోయిన కియారా

    జోష్‌లో రెచ్చిపోయిన కియారా

    షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా కబీర్ సింగ్ అనే పేరుతో అర్జున్ రెడ్డి చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. తెలుగులో చూపించిన అన్ని రొమాంటిక్ సన్నివేశాలు, లిప్‌లాక్స్ ఈ చిత్రంలోనూ ఉండేలా చూసుకున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే కబీర్ సింగ్ ఏ రేంజ్‌లో ఉండనుందో అర్థమవుతోంది. ఇక లిప్ ‌క్ సన్నివేశాల్లో కియారా రెచ్చిపోయి నటించడం చూసి ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు.

    షాలినిని మించిన కియారా

    షాలినిని మించిన కియారా

    అర్జున్ రెడ్డి సినిమా వచ్చేంతవరకు హీరోయిన్ షాలిని పాండే ఎవ్వరికీ తెలియదు. ఈ సినిమాలో ఆమె చూపిన అభినయం, ముఖ్యంగా రొమాంటిక్ ఫీలింగ్స్ చూసి యువ హృదయాలు మత్తెక్కిపోయాయి. దీంతో ఒక్కసారిగా ఒండస్ట్రీలో ఆమె పేరు మారుమోగింది. సరిగ్గా అదే పాత్రలో ఇప్పుడు ముంబై బ్యూటీ కియారా కనిపించబోతోంది. షాలినిని మించి బోల్డ్‌గా ఈమె రొమాంటిక్ ఫీలింగ్స్ పండించిందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.

    కబీర్ సింగ్ మూవీ

    కబీర్ సింగ్ మూవీ

    ఇక కబీర్ సింగ్ చిత్ర విశేషాలు పరిశీలిస్తే.. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగానే ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. చిత్రంలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. జూన్ 21 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

    English summary
    Kiara plays tremendous role in Kabir Singh movie. She performed very well in liplock seens, romantic movements. The Kabir Singh trailer has huge responce on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X