పెళ్లి తర్వాత హాట్ డోస్ పెంచేసిన కియారా అద్వానీ.. దాచాల్సిన అందాలే చూపిస్తూ!
తెలుగులోకి అనేక సినీ ఇండస్ట్రీ ముద్దుగుమ్మలు అడుగు పెట్టి సత్తా చాటుతుంటారు. కొంతమంది గ్లామర్ కే పరిమితం అయి ఐటమ్ సాంగ్స్ తో ఆకట్టుకుంటే మరికొందరు మాత్రం హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ గ్లామరస్ బ్యూటి కియారా అద్వానీ ఒకరు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాతో తెలుగులోకి దిగుమతి అయిన ఈ సుందరి ప్రస్తుతం హిందీ, తెలుగు చిత్రాలతో దూసుకుపోతోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా స్కిన్ షో చేస్తూ హీట్ పుట్టిస్తోంది. తాజాగా అబ్బురపరిచేలా ఎద అందాల విందు చేసింది ఈ బాలీవుడ్ హాట్ లేడీ.

అందం-అభినయం: బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు జోడీగా భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమాలో ఓ మధ్య తరగతి అమ్మాయిగా, అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. అలాగే కియారా పేరు కూడా తెలుగులో పాపులర్ అయింది.

మళ్లీ బాలీవుడ్: మహేశ్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కియారా అద్వానీ జోడి కట్టిన చిత్రం వినయ విధేయ రామ. ఇందులో కాస్తా గ్లామర్ ఒలకబోస్తూ అందాలు ఆరబోసింది ఈ బ్యూటి. అయితే బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. దీంతో ఆమెకు తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గాయి. ఇక మళ్లీ బాలీవుడ్ కే మకాం మార్చింది ఈ హిందీ భామ.

అన్నీ సక్సెస్: హిందీ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది కియారా అద్వానీ. ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న కియారా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఆమె నటించిన అన్నీ చిత్రాలు సక్సెస్ కావడంతో అక్కడ లక్కీ హీరోయిన్ గా ముద్ర పడిపోయింది.

సల్మాన్ సలహా: ఇదిలా ఉంటే 2014లో ఫగ్లీ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సుందరాంగీ కియారా అద్వానీ అసలు పేరు అలియా అద్వానీ. అయితే అప్పటికే అలియా భట్ కూడా ఉండటంతో తన పేరును కియారాగా మార్చుకోమ్మని కండలవీరుడు సల్మాన్ ఖాన్ సలహా ఇచ్చాడు. దీంతో ఆమె కియారా అద్వానీకి హిందీ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంది.

వైభవంగా: ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమాలో మరోసారి జోడీ కట్టనుంది కియారా అద్వానీ. జూన్ 29న సత్య ప్రేమ్ కి కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం సాగించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే పెళ్లి కూడా చేసుకుంది. రాజస్థాన్ లో వీరి వివాహం అంగరంగా వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.
పెళ్లయినా కూడా: సినిమాలు, పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న కియారా అద్వానీ సోషల్ మీడియాలోనూ హాట్ గా అందాలను ఎక్స్ పోజ్ చేస్తుంది. తాజాగా రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో ఎద అందాలను ఓపెన్ గా చూపించేసింది. పెళ్లయినా కూడా వివిధ రకాలుగా పోజులిస్తూ మత్తెక్కే టైట్ క్లీవేజ్ షో చేస్తున్న కియారా ఫొటోలు నెట్టింట్లో గింగిరాలు తిరుగుతున్నాయి. దీంతో నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











