రొమాన్స్ సహజమే.. వాళ్లకి మరింత దగ్గర కావడానికి అలా చేయడంలో తప్పేముంది: కియారా

భరత్ అనే నేను సినిమా తెలుగులో కియారా అద్వానీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. మొదటి సినిమానే అయినప్పటికీ భరత్ భామగా ఈమె ఆకట్టుకోవడంతో తెలుగు యువత ఫిదా అయ్యారు. మొదట మహేష్ సరసన వయ్యారాలు ఒలకబోసిన ఆమె.. వెంటనే వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్‌తో రొమాన్స్ చేసింది. ఈ రెండు సినిమాలతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది కియారా. ప్రస్తుతం ఈ భామ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే షోట్టింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మీడియాతో మాట్లాడిన కియారా రొమాన్స్ పట్ల ఆసక్తికరంగా స్పందించింది.

ముద్దు సన్నివేశాల్లో ఇబ్బందిపై..

ముద్దు సన్నివేశాల్లో ఇబ్బందిపై..

''కథలో భాగంగా ముద్దు సన్నివేశాలు ఉంటాయి. పైగా ఇది మోడ్రన్‌ లవ్‌స్టోరీ. నేటి ప్రేమల్లో ముద్దులు, కౌగిలింతలు సహజంగా ఉండేవే. కాబట్టి వాటిని అంతే సహజంగా, అందంగా షూట్ చేశాం. నాకైతే ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు. కథలో భాగంలో ఎలాంటి సన్నివేశమైనా ఒకటి గానే ట్రీట్ చేస్తా'' అని తెలిపింది కియారా.

విజయ్‌ దేవరకొండ కలిశాడు కానీ షాలిని మాత్రం

విజయ్‌ దేవరకొండ కలిశాడు కానీ షాలిని మాత్రం

అర్జున్ రెడ్డి రీమేక్ సినిమా కావడంతో ఇంటర్వ్యూలో భాగంగా విజయ్‌ దేవరకొండ, షాలిని లను కలిశారా? అనే ప్రశ్న కియారాకు ఎదురైంది. దీనిపై స్పందించిన ఆమె.. విజయ్‌ దేవర కొండని ఒక అవార్డు వేడుకలో కలిశానని, అర్జున్‌రెడ్డి గురించి మాట్లాడుకున్నాం. సలహాలు ఇవ్వలేదు కానీ సందీప్‌రెడ్డి ఉన్నాడు కదా! ధైర్యంగా ఉండు అని చెప్పాడంతే.. అని పేర్కొంది కియారా.

దాని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా

దాని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా

ఇక తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల తర్వాత తన మూడో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అంటోంది కియారా. మంచి అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉన్నానని పేర్కొంది. హైదరాబాద్‌ తన రెండో ఇల్లు లాంటిదని ఆసక్తికరంగా బదులిచ్చింది కియారా.

మళ్లీ వెబ్‌సిరీస్‌లు

మళ్లీ వెబ్‌సిరీస్‌లు

లస్ట్ స్టోరీస్ అనే అడల్ట్ వెబ్ సిరీస్‌తో ఆకట్టుకునే ఈ భామ.. తనకు వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఒక్కటే అని చెబుతోంది. నేటి యువతరం ఎక్కువగా వెబ్‌ సిరీస్‌లు చూస్తున్నారు. కాబట్టి వాళ్లకి మరింత దగ్గర కావడానికి అవి చేయడంలో తప్పు లేదనేది తన అభిప్రాయం అని చెప్పింది కియారా.

 కబీర్ సింగ్ మూవీ

కబీర్ సింగ్ మూవీ

తెలుగులో సంచలన విజయ సాధించిన అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ గా కబీర్ సింగ్ తెరకెక్కింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. చిత్రంలో షాహిద్ కపూర్, కియారా జంటగా నటిస్తున్నారు. తెలుగు అర్జున్ రెడ్డికి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే ఈ సినిమాకు కూడా దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X