రామ్ చరణ్ కోసం మరో రెండు ఆఫర్లను వదిలేసుకున్న స్టార్ హీరోయిన్.. ఆ ఛాన్స్ మళ్ళీ రాదేమో అని..

ఒకప్పుడు బాలీవుడ్ లో నటించిన హీరోయిన్ ఎవరైనా కూడా మళ్లీ సౌత్ ఇండస్ట్రీ వైపు పెద్దగా చూసే వాళ్ళు కాదు. తెలుగు సినిమాలు తమిళ్ సినిమాలు చేసిన తర్వాత కూడా వాళ్ళు బాలీవుడ్ లోకి వెళితే మళ్లీ వెనక్కి తిరిగి చూసే వారు కాదు. ఒక విధంగా మళ్ళీ సౌత్ సినిమాలు చేస్తే ఆ స్థాయి తగ్గిపోతుంది అనే ఆలోచనతో వెనక్కి తిరిగి చూసే వారు కాదట. అయితే మారుతున్న కాలంలో ఆలోచనా విధానం కూడా చాలా మారిపోయింది. కొంతమంది హీరోయిన్స్ బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

అలాంటి బ్యూటీలలో కియారా అద్వానీ కూడా ఉందని చెప్పవచ్చు. ఈ బ్యూటీ గత కొంతకాలంగా సౌత్ కథలను ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటోంది. కథ నచ్చితే ఏ మాత్రం రిజెక్ట్ చేయకుండా డేట్స్ ఇచ్చేస్తోంది. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఈ బ్యూటీ పెద్దగా డిమాండ్ చేయడం లేదని టాక్ అయితే వస్తోంది. ఇక ఇటీవల రామ్ చరణ్ సినిమా కోసం రెండు ప్రాజెక్టులకు కూడా వదిలేసుకున్నట్లు తెలుస్తోంది.

మార్కెట్ పెరగడంతో

మార్కెట్ పెరగడంతో

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో ఆఫర్ వచ్చింది అంటే హీరోయిన్స్ ఏ మాత్రం వెనక్కి తిరిగి చూసుకునే వారు కాదు. నార్త్ లో ఛాన్స్ వస్తే లైఫ్ సెట్ అయిపోయినట్లేనా సంబరాలు చేసుకునేవారు. అయితే అక్కడ ఫ్లాప్ వచ్చినా కూడా మళ్లీ తెలుగు సినిమాల వైపు పెద్దగా చూసే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది హీరోయిన్స్ అయితే తెలుగు సినిమాల్లో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ కూడా మార్కెట్ అంతకంతకు పెరుగుతూ ఉండడం వల్లనే హాట్ హీరోయిన్స్ ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు.

మిగతా భాషల్లో కూడా

మిగతా భాషల్లో కూడా

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధిస్తే మిగతా భాషల్లో కూడా మంచి విజయాన్ని అందుకోవచ్చని కొందరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అలా మొదట్లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ ప్రస్తుతం బాలీవుడ్ లో అగ్ర తారలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక మరికొందరు మాత్రం బాలీవుడ్ లో హిట్స్ వచ్చినా కూడా మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కియారా అద్వానీ భరత్ అనే నేను సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామలో కూడా నటించింది.

RC 15 మెయిన్ హీరోయిన్

RC 15 మెయిన్ హీరోయిన్

మొదటి సినిమా సక్సెస్ అయినప్పటికీ రెండవ సినిమా అంతగా సక్సెస్ కాకపోవడంతో కియరా మళ్లీ తెలుగులో మరో సినిమా అయితే చేయలేదు. అవలశాలు వచ్చినప్పటికీ పెద్దగా ఇంట్రెస్ట్ చూప లేదు. కానీ మొత్తానికి మళ్లీ చాలా కాలం తర్వాత రామ్ చరణ్ తో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. RC 15 సినిమాలో కియరా మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే.

Recommended Video

RRR First Single Dosti Song Review | Filmibeat Telugu
మిగతా రెండు సినిమాలను రిజెక్ట్ చేసి..

మిగతా రెండు సినిమాలను రిజెక్ట్ చేసి..

అయితే ఈ సినిమా లోకి కియరా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. శంకర్ సినిమాలో హీరోయిన్స్ కేవలం గ్లామర్ రోల్స్ చేయడానికి మాత్రమే ఉండరు. వారి పాత్రలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శంకర్ హీరో హీరోయిన్స్ ను కథకు తగ్గట్టుగా మలుచుకోవడంలో చాలా తెలివిగా అడుగులు వేస్తారు. ఆయన.కీయారాను సెలెక్ట్ చేసుకున్నారు అంటే తప్పకుండా ఏదో ఓ మంచి పాత్ర అయి ఉంటుందని సమాచారం. ఇక బాలీవుడ్లో మరో రెండు ఆఫర్స్ వచ్చిన సమయంలో శంకర్ సినిమా చేసే ఛాన్స్ వచ్చిందట. కానీ కియరా ఆ రెండు ప్రాజెక్టులను పక్కనబెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మళ్లీ డేట్స్ అడ్జెస్ట్ కాకపోతే కష్టమవుతుందని ఎలాగైనా ఈ సినిమాలు చేయాలనే ఆలోచనతోనే మిగతా ప్రాజెక్టులను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X