దానికి దూరంగా ఉంటా.. గర్బవతిగా కియారా అద్వానీ కోరికలు!
హిందీ సినిమా నుంచి వచ్చి తెలుగు సినిమాలో కూడా మంచి మార్కెట్ అండ్ ఫేమ్ ని తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మందే కనిపిస్తారు. మరి వీరిలో మంచి హాట్ ట్రీట్ ఇచ్చే బ్యూటీలు కూడా ఎక్కువే కాగా ఈ తరహా హీరోయిన్స్ లో మన తెలుగులో స్టార్స్ గా కూడా మారిన వారిలో కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసిన హీరోయిన్ కియారా అద్వానీ కూడా ఒకామె అని చెప్పవచ్చు.
కాగా కియారా అద్వానీ హిందీ సినిమాలోనే కాకుండా తెలుగు సినిమాలో కూడా మాంచి ఫేమ్ ని అందుకుంది. తన ఎంట్రీనే మహేష్ బాబుతో ఇవ్వడం ఆ తర్వాత కూడా బిగ్ స్టార్ సరసన వరుసగా రెండు సినిమాలు చేసే ఛాన్స్ దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. కాగా కియారా హిందీ సహా తెలుగు సినిమాలో మంచి ఫేమ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి కూడా చేసేసుకుంది.

బాలీవుడ్ యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకొని చాలా మంది కుర్రాళ్ళ గుండెల్లో బాకు గుచ్చింది. ఇక ఈ తర్వాత కూడా పలు సినిమాల్లో కనిపించి అలరించిన కియారా లేటెస్ట్ గా ఒక ఊహించని గుడ్ న్యూస్ ని షేర్ చేసింది. తాను ప్రస్తుతం గర్భవతిని అయ్యాను అని సిద్ధార్థ్ తో కలిసి ఒక పోస్ట్ చేసి గుడ్ న్యూస్ ని అందించింది.
దీనితో ఇండియా వైడ్ గా అనేకమంది స్టార్స్ ఆమెకి శుభాకాంక్షలు కూడా తెలిపారు. కాగా ఆమె ప్రెగ్నెంట్ అయ్యాక తన ప్రెగ్నన్సీ కోసం చేసిన కామెంట్స్ కొన్ని ఇపుడు బాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారాయి. కాగా తన ప్రెగ్నన్సీ కోసం కియారా ఏం చెబుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈమె తనకి ఒక బిడ్డ సరిపోదు ఇద్దరు పిల్లలు కావాలి అని కోరుకుంటున్నాను అని చెబుతుంది.
అంతే కాకుండా ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం కూడా షేర్ చేసుకుంది. మామూలుగా హీరోయిన్స్ అన్నాక వారి ఫిజిక్ పరంగా చాలా స్ట్రిక్ట్ గా ఉండాల్సి వస్తుంది. తమ బాడీ షేప్స్ మారకుండా డైట్ లు వర్కౌట్స్ ఇలా చాలానే చేస్తూ ఆహరం పరంగా కఠినంగా కూడా ఉంటారు. కాగా ఇపుడు తాను ప్రెగ్నెంట్ అయ్యాను కాబట్టి కొన్నాళ్ళు పాటు నాకు ఇలాంటివి ఏమీ ఉండవు. వర్కవుట్లకు దూరంగా ఉంటా. ఫుడ్ విషయంలో నాకు రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. నాకు నచ్చినవి నేను తింటాను అంటూ కూడా చెబుతుంది.
దీనితో తన ప్రెగ్నన్సీ విషయంలో ఈ అందమైన హీరోయిన్ కామెంట్స్ ఇపుడు బి టౌన్ లో వైరల్ గా మారాయి. ఇక రీసెంట్ గానే కియారా అద్వానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం "గేమ్ ఛేంజర్" లో కనిపించిన సంగతి తెలిసిందే. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో కియారా కేవలం గ్లామర్ రోల్ లో మాత్రమే కాకుండా కీలక పాత్రలో కూడా నటించింది. ఇక ప్రస్తుతం అయితే ఆమె ఆల్రెడీ నటించిన సినిమాలు మాత్రం రానున్నాయి తప్పితే కొత్త సినిమాలు ఏవి ఓకే చేయలేదు అని తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











