Just In
Don't Miss!
- Sports
ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అజహరుద్దీన్ కలల లిస్టు ఇదే.. ఐపీఎల్, 4 సెంచరీలు సహా!!
- News
చర్చలు 120 శాతం ఫెయిల్.. 'ఉపా' చట్టాన్ని ప్రయోగిస్తారా? బ్రోకర్లతో చర్చలకు వెళ్లం.. రైతుల సంఘాల ఫైర్...
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రియుడితో కియారా అద్వానీ ప్రైవేట్ టూర్.. ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ ప్రేమపక్షులు
అందాల భామ కియారా అద్వానీ దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. వెండితెరపైనే కాకుండా వెబ్ సిరీస్‌లతో బుల్లితెరపైన కూడా అద్బుతంగా రాణిస్తున్నారు. అయితే ప్రొఫెషనల్‌గా పక్కగా వ్యవహరిస్తున్న ఈ భామ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు బాలీవుడ్ మీడియాలో రూమర్లుగా తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆమె ప్రైవేట్ టూర్ మరింత వైరల్ అయింది. ఆ విషయాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లో అగ్రతారగా
బాలీవుడ్‌లో ఫగ్లీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ కబీర్ సింగ్ అలాంటి భారీ హిట్ కోసం ఐదేళ్లు ఆగాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎంఎస్ ధోని, గుడ్ న్యూస్, అంగ్రేజీ మీడియం, లక్ష్మీ, ఇందూ కి జవానీ లాంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించింది. ఇక ఆమె చేతిలో షేర్షా, భూల్ భులయ్యా, జగ్ జగ్ జీయో చిత్రాలు షూటింగు దశలో ఉన్నాయి.

తెలుగులో మహేష్, రాంచరణ్‌తో
ఇక తెలుగులో భరత్ అనే నేను చిత్రం ద్వారా సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం కొట్టేసిన ఈ భామ వెంటనే రాంచరణ్‌తో వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. ఆ తర్వాత తెలుగు సినిమాకు దూరంగా ఉంటున్నారు.

కరోనా బారిన పడ్డ బ్యూటీ
ఇక ఇటీవల కాలంలో కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో కొన్నాళ్లు గృహ నిర్బంధంలోనే ఉండిపోయారు. కరోనావైరస్ నెగిటివ్ అని తేలిన తర్వాత ఉపశమనం కోసం విదేశీ విహారం చేసేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో హీరో సిద్దార్థ్‌తో కనిపించడం అనేక ఊహాగానాలకు దారి తీసింది.

సిద్దార్థ్ మల్హోత్రాతో డేటింగ్
ఇదిలా ఉంటే.. గత కొద్దికాలంగా బాలీవుడ్ యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అలాంటి వార్తలకు బలం చేకూర్చే విధంగా పలు మార్లు వారిద్దరూ సన్నిహితంగా కనిపిస్తూ మీడియా కంట పడ్డారు. తాజాగా తమ అఫైర్ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ ఎయిర్‌పోర్టులో మీడియాకు చిక్కారు.

మాల్దీవుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనేందకు కియారా అద్వానీ మాల్దీవులకు వెళ్లినట్టు తెలిసింది. కియారా, సిద్దార్థ్ చెట్టాపట్టాల్ వేసుకొని ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించగా మీడియా కెమెరాలో బంధించారు. ముఖానికి మాస్క్ వేసుకొన్న ఈ ప్రేమ పక్షులు మీడియా కంటపడకుండా తప్పించుకోలేకపోవడం గమనార్హం.