కియారా అద్వానీ అందంలోనే కాదు.. ఆస్తుల్లోనూ టాప్.. ఆరేళ్లలో సంపాదన ఎంతంటే!
బాలీవుడ్ తెరపై తళుక్కున మెరిసిన కియారా అద్వానీ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. తెలుగులోనూ అగ్ర హీరోలతో జతకట్టి బలమైన ఫ్యాన్ బేస్‌ను దక్షిణాదిలో సంపాదించుకొన్నారు. అటు బాలీవుడ్‌లోను, ఇటు టాలీవుడ్‌లోను భారీ ప్రాజెక్టులను సొంతం చేసుకొంటున్నారు. అయితే త్వరలోనే ఆమె నటించిన లక్ష్మీబాంబ్ చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆర్థిక నిపుణులు ఆ చిత్రంలోని నటీనటులు సంపాదనను అంచనా వేశారు. ఆ క్రమంలో వారు వెల్లడించిన కియారా అద్వానీ సంపాదన వివరాలు ఎంతంటే..

సల్మాన్ ఖాన్ సలహా మేరకు
కియారా అద్వానీ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె అసలు పేరు అలియా అద్వానీ. ఫగ్లీ చిత్రం విడుదలకు ముందు సల్మాన్ ఖాన్‌ను కలిస్తే.. పేరు మార్చుకొమని సూచించడమే కాకుండా కియారా పేరును సూచించారట. దాంతో ఆమె కియారా అద్వానీగా మారిపోయింది. కియారా అనే పేరు పెట్టుకోవడానికి కారణం అంజానా అంజనీ సినిమాలో ప్రియాంక చోప్రా క్యారెక్టర్ పేరు కావడమే.

బాలీవుడ్‌లో ఫ్యామిలీ బ్యాకప్
కియారా అద్వానీకి బాలీవుడ్‌లో మంచి బ్యాకప్ కూడా ఉంది. అశోక్ కుమార్, సయీద్ జాఫ్రీ లాంటి వాళ్లు ఆమెకు బంధువులు కావడంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టడానికి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. అలాగే ముఖేష్ అంబానీ కూతురు కూడా కియారాకు క్లాస్‌మేట్ అనేది గమనార్హం. అయితే ఇలాంటి రిలేషన్స్ పెద్దగా ఉపయోగించుకోకుండా సొంతంగా తన ప్రతిభను ఉపయోగించుకొని ఇండస్ట్రీలో నిలదొక్కకున్నారు.

ఎంఎస్ ధోని, కబీర్ సింగ్ తర్వాత
బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడానికి చాలానే కష్టపడింది. ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరి వచ్చేంత వరకు కియారా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత కబీర్ సింగ్ చిత్రంతో బాలీవుడ్‌లో కియారా పేరు మార్మోగింది. వెంటవెంటనే లక్ష్మీబాంబ్, అంగ్రేజీ మీడియం, షేర్షా, భూల్ భులయ్యా లాంటి చిత్రాలతోపాటు అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో
తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది. సూపర్ స్టార్ మహేష్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లాంటి హీరోలతో జతకట్టింది. అయితే ఆ తర్వాత బాలీవుడ్‌లో భారీగా ఆఫర్లు దక్కడంతో తెలుగు చిత్రాలపై పెద్దగా పట్టించుకొనే అవకాశం దక్కడం లేదు. అయితే కొన్ని చిత్రాల్లో నటించేందుకు చర్చలు జరుపుతున్నారు. మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో నటించనున్నారనే వార్తలు మీడియాలో కనిపించాయి.

కియారా ఆస్తి ఎంతంటే
ఇలా బాలీవుడ్, టాలీవుడ్‌లో భారీ ఆఫర్లు దక్కించుకొంటున్న కియారా అద్వానా నికర సంపద ప్రస్తుతం 3 మిలియన్ యూఎస్ డాలర్లు అని తేల్చారు. అంటే గత ఆరేళ్లలో కియారా సంపాదన విలువ అక్షరాల 21 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. తాజాగా లక్ష్మీబాంబ్ చిత్రం కోసం ఆమె రూ.కోటి రూపాయలకుపైగా రెమ్యునరేషన్ తీసుకొన్నట్టు వార్తలు వస్తున్నాయి.
Recommended Video

కాంచన చిత్రం రీమేక్‌గా
ఇక అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటించిన లక్ష్మీబాంబ్ చిత్రం త్వరలోనే ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నది. కరోనావైరస్ లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో డిస్నీ+హాట్ స్టార్ యాప్‌లో ఈ చిత్రాన్ని జూలై లేదా ఆగస్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన కాంచన ఆధారంగా లక్ష్మీబాంబ్ రూపొందింది. ఈ సినిమాకు లారెన్స్ రాఘవ దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











