బికినీలో కియారా అద్వానీ రచ్చ.. వీడియోకు 11 లక్షల లైక్స్.. సోషల్ మీడియాలో రచ్చ రంబోలా!
అందాల భామ కియారా అద్వానీ మరోసారి తన అందచందాలతో రచ్చ చేసింది. ఓ వైపు ముంబైని వర్షాలు ముంచెత్తుండగా.. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ బికినీలో గ్లామర్‌తో సునామీ సృష్టించే ప్రయత్నం చేసింది. ఆమె షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఏముందో ఓ సారి చూసొద్దాం పదండి...

ముంబైలో భోరున వర్షాలు
ప్రసుతం ముంబైలో భోరున వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అందరూ వర్షం ఎప్పుడు ఆగిపోతుందో అని బాధపడుతున్నట్టే.. కియారా కూడా వానలు కురవడం ఆగిపోయి.. ఎండ, వెలుతురు ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూస్తున్నట్టు వెల్లడించారు. గతంలో మాల్దీవులకు వెళ్లిన సమయంలో సముద్ర తీరంలో సూర్య కిరణాలు ముద్దాడుతున్నట్టు షూట్ చేసి వీడియోను షేర్ చేశారు.

మాల్దీవులకు వెళ్లిన సమయంలో
ఇటీవల మాల్దీవులకు వెళ్లిన సమయంలో సముద్ర తీరంలో పింక్ కలర్ బికినీలో కియారా మరింత గ్లామర్‌గా కనిపించారు. అర్దనగ్నంగా అందాల అరబోతకు పాల్పడిన ఆమె ఆ వీడియోలో మరింత సెక్సీగా కనిపించారు. ఆ సందర్భంగా దిగిన సెల్పీలతో వీడియోను రూపొందించారు.

అలియాభట్, బిగ్ బీ మనవరాలు
కియారా అద్వానీ షేర్ చేసిన వీడియోను నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు. సాధారణ జనమే కాకుండా ఆలియాభట్, అమితాబ్ మనవరాలు నవ్య నందా నవేలీ కూడా కామెంట్లు, ఎమోజీలతో హోరెత్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కొద్ది గంటల్లోనే 11 లక్షల లైకులు
కియారా అద్వానీ షేర్ చేసిన వీడియోకు భారీగా లైకుల వచ్చాయి. హీరోయిన్ కీర్తీ సురేష్‌తోపాటు దాదాపు 11 లక్షల మంది లైక్ కొట్టారు. నెటిజన్లు భారీగా లవ్ సింబల్స్, ఫైర్ సింబల్స్ పెట్టి.. హాట్.. సెక్సీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పలువురు నెటిజన్లు పలు విధాలుగా కామెంట్లు చేస్తూ కనిపించారు.
కియారా అద్వానీ సినీ కెరీర్
ఇక కియారా అద్వానీ కెరీర్ విషయానికి వస్తే.. ఫగ్లీ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఎంఎస్ ధోని, సినిమా, లస్ట్ స్టోరీస్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకొన్నారు. ఆ తర్వాత భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రంతో దక్షిణాదిలో స్టార్ హోదాను సంపాదించుకొన్నారు కబీర్ సింగ్‌తో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారారు. ప్రస్తుతం షేర్షా, భూల్ భులయ్యా 2, జగ్ జగ్ జీయో, మిస్టర్ లేలే సినిమాలో నటించారు.


Click it and Unblock the Notifications











