సెక్సీ లుక్‌లో కెమెరాకు చిక్కిన కియారా.. ఫోకస్ అవుతున్న ఫైరింగ్ బ్యూటీ అందాలు
నేటితరం హీరోయిన్లంతా ఫాలోయింగ్ పెంచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఈ మేరకు అందాల ఆరబోతే ప్రధాన అస్త్రంగా ఎర వేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వారికే తెలియకుండా కొన్ని పిక్స్ వైరల్ అవుతుంటాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ విషయంలో అదే జరిగింది. వివరాల్లోకి పోతే..

కెమెరా కళ్లన్నీ అందాలపైనే..
హీరోయిన్స్ అందాలకు తగ్గట్టుగానే కెమెరా కళ్ళు కూడా ఎప్పుడూ వారివైపే ఉంటున్నాయి. అందాల భామలను వెంటాడి మరీ కెమెరా బటన్‌ని క్లిక్ అనిపిస్తున్నాయి. అందుకే వారికి తెలియకుండానే వాళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనిస్తున్నాం. తాజాగా కియారకు సంబంధించిన ఓ పిక్ నెట్టింట సెన్సేషన్ అవుతోంది.

చురుకైన దుస్తులు.. చేతిలో డ్రింక్
ఒక చేతిలో డ్రింక్, మరో చేతిలో బ్యాగ్ పట్టుకొని.. చురుకైన దుస్తులు ధరించి ఎక్కడికో వెళ్తోంది కియారా. ఇంతలో కెమెరా కళ్ళు ఆమెపై పడటం, ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం చకచకా జరిగిపోయాయి. ఈ ఫొటోల్లో ఫైరింగ్ బ్యూటీ అందాలు బాగా ఫోకస్ అవుతుండటంతో తెగ షేర్ చేసుకుంటున్నారు నెటిజన్లు.

మహేష్ బాబుతో ఆ వెంటనే రామ్ చరణ్‌తో
ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన కియారా అద్వానీ.. ఇటీవలే తెలుగు తెరపై కాలుమోపి మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' సినిమా చేసింది. ఆ తర్వాత రామ్ చరణ్‌తో 'వినయ విధేయ రామ' సినిమాలో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మళ్ళీ బాలీవుడ్ సినిమాలతో బిజీ అయింది. అందం, అభినయం రెండూ పుష్కలంగా ఉన్న ఈ భామ.. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ ప్రేక్షక లోకాన్ని ఫిదా చేస్తోంది.

ఈ సారి వరుణ్ తేజ్..
తాజా సమాచారం మేరకు కియారా అద్వానీ తిరిగి తెలుగు తెరపై మెరిసేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. మళ్ళీ మెగా హీరోతో సినిమా అనగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కియారా ఓకే చెప్పేసిందని ఫిలిం నగర్‌లో టాక్ వినిపిస్తోంది.
Recommended Video

కియారా అందాలకు మరింత పదును
అల్లు బాబీ సమర్పణలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందనున్న సినిమా కోసం లస్ట్ భామ కియారను సంప్రదించినట్లు తెలుస్తోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించే ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అతిత్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో కియారా అందాలకు
మరింత పదును పెట్టాలని చూస్తున్నారట.


Click it and Unblock the Notifications











