కియారా అద్వానికి సెక్స్ కంటే అదే ఇష్టమట? వైరల్ అవుతున్న వీడియో
స్టార్ హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో బోల్డ్ సందేహాలకు చాలా ఈజీగా సమాధానం ఇచ్చేస్తున్నారు. ఆడియెన్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా కూడా చాలా డైరెక్ట్ గా చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల హాట్ బ్యూటీ కీయరా అద్వానీ కూడా అదే తరహాలో ఒక బోల్డ్ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. కీయరా తెలుగులో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.

సెక్స్ కంటే ఇష్టమైనవి..
సెక్స్ కంటే ఇష్టమైన మూడు విషయాల గురించి సమాధానం చెప్పమంటే ఆమె ఏ మాత్రం సందేహించకుండా తనకు ఇష్టమైన వాటి గురించి వివరణ ఇచ్చింది. ఇక అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. సాధారణంగా కీయరా అద్వానీ బోల్డ్ పాత్రలతోనే నటనలో షాక్ ఇస్తుంటుంది. ఇక సెక్స్ గురించి అడిగినా కూడా ఆమె చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది.

లక్ష్మీ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా..
ప్రస్తుతం కీయరా లక్ష్మీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. సోషల్ మిడియా ద్వారానే సినిమాపై అంచనాలను పెంచె విదంగా అడుగులు వేస్తోంది. సౌత్ లో కాంచన అనే సినిమాను దర్శకుడు రాఘవ లారెన్స్ హిందీలో లక్ష్మీగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాను ఈ నెల 9న డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేస్తున్నారు.
సెక్స్ కంటే అవే ఇష్టం..
అసలు మ్యాటర్ లోకి వస్తే సెక్స్ కంటే మీరు ఇంపార్టెన్స్ ఇచ్చే మూడు ముఖ్యమైన ప్రశ్నల గురించి చెప్పండి అని ప్రశ్నలు ఎదురవ్వగా.. షాపింగ్, పిజ్జా, ఒక మంచి సినిమా అంటూ.. ఈ మూడు కూడా సెక్స్ కంటే ఎక్కువ ఇష్టమని బ్యూటీ చాలా క్లియర్ గా వివరణ ఇచ్చింది. ఇక అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. లక్ష్మీ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎదురైన ప్రశ్నలకు కీయరా ఈ విధంగా సమాధానం ఇచ్చింది.

లక్ష్మీ బాంబ్ టైటిల్ ని ఎందుకు మార్చారంటే..
ఇక లక్ష్మీ సినిమాకు మొదట టైటిల్ ని లక్ష్మీ బాంబ్ అని పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల శ్రీ రాజ్ పుత్ కర్ణి సేన ఆ టైటిల్ పై అభ్యంతరం చెప్పడంతో వెంటనే మార్చేశారు. హిందు దేవత పేరును కించ పరిచేలా బాంబ్ అని పెట్టడం కరెక్ట్ కాదని, మనోభావాలు దెబ్బ తినే అవకాశం ఉందని వెంటనే చిత్ర యూనిట్ కూడా స్పందించి.. పేరును మార్చేసింది. ఇక ఈ లాక్ డౌన్ అనంతరం డిజిటల్ ఫ్లాట్ పై విడుదల కానున్న అతిపెద్ద సినిమా ఇదే కావడంతో ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో అని ఇండస్ట్రీలో చాలా మంది ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











