ఆ ఇద్దరితో మొదటిసారి.. తొలి అనుభవాలను పంచుకొన్న కియారా అద్వానీ
బాలీవుడ్‌లో ప్రముఖ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం వార్ 2 (War 2). 2019 సంవత్సరంలో బ్లాక్ బస్టర్ సినిమాగా విజయం అందుకొన్న వార్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి పార్ట్‌లో టైగర్ ష్రాఫ్, హృతిక్ నటించగా, ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా అత్యంత క్రేజ్ ఉన్న మల్టీస్టారర్‌గా రూపొందుతున్నది. ఎన్టీఆర్ జన్మదిన మే 20 తేదీ సందర్బంగా వార్ 2 సినిమా టీజర్‌ను తెలుగు, హిందీ, తమిళంలో రిలీజ్ చేశారు. ఈ సినిమా గురించి కియారా అద్వానీ తన అనుభూతిని పంచుకొన్నారు. కియారా చేసిన సోషల్ మీడియా పోస్టు వివరాల్లోకి వెళితే..
టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ హీరోలుగా వార్ చిత్రాన్ని సుమారుగా 170 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా 500 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాంటి మూవీకి సీక్వెల్‌ను భారీగా నిర్మించారు. యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో ఆరో చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా షబ్బీర్ అహ్లువాలియా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆలియా భట్, శర్వారీ అతిథి పాత్రల్లో మెరువనున్నారు. ఈ సినిమాను సుమారుగా 500 కోట్ల రూపాయలతో హై యాక్షన్ మూవీగా నిర్మించారు. ఈ మూవీ గ్రాండియర్‌గా రూపొందించినట్టు టీజర్‌లో కనిపించిన సన్నివేశాలు ఫీలింగ్‌ను కల్పించాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎన్టీఆర్‌కు బాలీవుడ్ ప్రవేశం తొలిసారి. హృతిక్ రోషన్, కియారా అద్వానీతో కలిసి నటించడం కూడా మొదటిసారే. ఈ సినిమా టీజర్‌ను చూస్తే.. రా (Raw) ఎజెంట్‌గా హృతిక్ నటిస్తే.. అతడితో పోటీ పడుతూ విలన్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ఇద్దరు పోటాపోటీగా తమ నటనతో తలపడ్డారనే ఫీలింగ్ టీజర్ ద్వారా కలిగింది. వార్ 2 టీజర్ మాత్రం అంచనాలను పెంచేలా చేసింది.
ఇక హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరిని పక్కన పెడితే.. టీజర్‌లో కియారా అద్వానీ గ్లామర్‌పరంగా పూర్తిగా మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా బికినీలో గరం గరంగా అందాలను ఆరబోసింది. స్పై థ్రిల్లర్‌కు కావాల్సిన మసాలాను తన పాత్ర ద్వారా దట్టించినట్టు కియారా లుక్స్ తెలియజేశాయి. ఈ టీజర్ రిలీజ్ తర్వాత కియారా ఆసక్తికరమైన ట్వీట్ చేసి తన ఆనందాన్ని పంచుకొన్నారు.
వార్ 2 సినిమా గురించి కియారా అద్వానీ ట్వీట్ చేస్తూ.. ఈ సినిమా చాలా కొత్త అనుభూతులను అందించింది. యష్ రాజ్ ఫిలింస్‌లో నటించడం ఫస్ట్. యాక్షన్ సినిమాలో నటించడం ఫస్ట్. హృతిక్, ఎన్టీఆర్‌తో కలిసి నటించడం మొదటిసారి. దర్శకుడు ఆయన్ ముఖర్జీ డైరెక్షన్‌లో సినిమా చేయడం ఫస్ట్ టైం. బికినీలో కనిపించడం కూడా తొలిసారే అని కియారా తన మొదటి అనుభవాలను పంచుకొన్నది. అలాగే వార్ 2 టీజర్ లింకులను షేర్ చేస్తూ.. ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన హిందీ, తెలుగు, తమిళంలో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా థియేటర్‌లో మరింత ఎక్సైట్ కలిగిస్తుందని నమ్ముతున్నాను అని అన్నారు.
అయితే కియారా అద్వానీ ప్రస్తుతం గర్బవతి. టీజర్‌లో కొన్ని సెకన్ల పాటు బికినీలో కనిపించిన సీన్లను చూస్తే మతిపోవడమే కాకుండా ఆమె నిజంగా ప్రెగ్నెంటేనా? అనే అనుమానం వస్తుంది. ఈ టీజర్ రిలీజ్ తర్వాత కియారా అద్వానీ అందాలు, సొగసుల గురించి సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతున్నది. మీరు ఓ సారి టీజర్ చూస్తే.. కియారా గ్లామర్ ఏం రేంజ్‌లో ఉంటుందో ఓ సారి చూసేయ వచ్చు.


Click it and Unblock the Notifications











