For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నటిగా స్థిరపడాలంటే తప్పదు.. పడుకునే ముందు మొత్తం తీసేస్తా.. కియారా సెన్సేషన్

  |

  టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ కియారా అద్వానీ. ఇటీవలే తెలుగు తెరపై కాలుమోపి మహేష్ బాబు, రామ్ చరణ్‌లతో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. అందం, అభినయం రెండూ పుష్కలంగా ఉన్న ఈ భామ.. తాజాగా హీరోయిన్ల గురించి చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి పోతే..

  వరుస సినిమాలు.. కిక్కు మీద కిక్కు

  వరుస సినిమాలు.. కిక్కు మీద కిక్కు

  టాలీవుడ్‌లో మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' సినిమా, రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' అనే సినిమాల్లో నటించి ఆ తర్వాత బాలీవుడ్ లో జెండా పాతింది కియారా. అక్కడ వరుస కమిట్‌మెంట్స్ ఇస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది కియారా. నెట్టింట హాట్ ఫోటోలు షేర్ చేస్తూ యూత్ ఆడియన్స్‌కి కిక్కు మీద కిక్కు ఇస్తోంది.

   ఆ హీరోతో ముద్దుల్లో మునిగి..

  ఆ హీరోతో ముద్దుల్లో మునిగి..

  ఇక ఇటీవలే 'కబీర్ సింగ్' సినిమాలో నటించిన కియారా.. ఆ సినిమా హీరో షాహిద్ కపూర్‌తో ముద్దుల్లో మునిగి తేలింది. టాలీవుడ్ సెన్సేషనల్ మూవీ అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ సినిమాగా ఈ మూవీ బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

  వెబ్ సిరీస్‌లో అడల్ట్ సీన్స్.. అమాంతం అలా

  వెబ్ సిరీస్‌లో అడల్ట్ సీన్స్.. అమాంతం అలా

  వెండితెర ప్రయాణంతో పాటు 'లస్ట్ స్టోరీస్' రూపంలో వెబ్ సిరీస్ ద్వారా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌ని షేక్ చేసింది కియారా. ఈ వెబ్ సిరీస్‌లో స్వయం తృప్తి పొందే మహిళగా నటించి యువతను పిచ్చెక్కించింది. దీంతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

  వీలు చిక్కితే చాలు.. అందాల విందు

  వీలు చిక్కితే చాలు.. అందాల విందు

  సోషల్ మీడియాలో బోల్డ్ లుక్స్‌ పోస్ట్ చేస్తూ యూత్ ఆడియన్స్ మతిపోగొట్టడంలో కియారా అద్వానీ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలతో మాయ చేస్తూ యూత్‌లో వేడి పుట్టించడం అమ్మడి స్టైల్. అందుకే ఆమెకు సోషల్ మీడియాలోనూ అంతులేని పాపులారిటీ ఉంది.

  సినిమాల జోష్.. ఆసక్తికర సంగతులు

  సినిమాల జోష్.. ఆసక్తికర సంగతులు

  ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లక్ష్మీబాంబ్‌' అనే ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తోంది కియారా. తెలుగు మూవీ కాంచనకు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే ఇందూ కీ జవానీ అనే మరో చిత్రం లోనూ ఆమె నటిస్తోంది. ఈ నేపథ్యం లోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా మాట్లాడింది కియారా.

   నటిగా స్థిరపడాలంటే తప్పదు

  నటిగా స్థిరపడాలంటే తప్పదు

  ఈ క్రమంలోనే హీరోయిన్ల గురించి ఆమె చేసిన కొన్ని కామెంట్స్ వావ్! అనిపిస్తున్నాయి. ఓ నటిగా స్థిరపడాలంటే అందం ఒక్కటే సరిపోదని అంటోంది కియారా. ఆత్మవిశ్వాసం, ఇచ్చిన పాత్రలో మెప్పించే సత్తా ఉంటేనే రాణించడం సాధ్యం అని చెబుతోంది.

  చూసేందుకు బాగుంటే సరిపోదు

  చూసేందుకు బాగుంటే సరిపోదు

  అంటే తాను హీరోయిన్‌గా స్థిరపడినట్లే అని చెప్పకనే చెబుతోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. అందంతో పాటు ఆత్మవిశ్వాసం ఉండాలని, చూసేందుకు బాగుంటే సరిపోదని ఇటీవలే తెలుసుకున్నానని కియారా ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

  KIARA,ARJUN REDDY& KARAN JOHAR SPOTTED AT MANISH MALOHTRA HOUSE
  మొత్తం మేకప్‌ తీసేస్తా.. ఎక్కువగా!

  మొత్తం మేకప్‌ తీసేస్తా.. ఎక్కువగా!

  ఇక తన మేకప్ విషయమై కియారా మాట్లాడుతూ.. తాను తక్కువ మేకప్‌ వేసుకుంటానని, చర్మం ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకుంటానని చెప్పింది. రాత్రి పడుకునే ముందు మొత్తం మేకప్‌ తీసేస్తానని, అలాగే నీళ్లు ఎక్కువగా తాగుతుంటానని పేర్కొంది.

  డేటింగ్‌ యాప్‌ల నేపథ్యంతో..

  డేటింగ్‌ యాప్‌ల నేపథ్యంతో..

  కియారా చేస్తున్న తాజా సినిమా ఇందూ కీ జవానీలో కియారా లీడ్ రోల్ పోషిస్తోంది. ఇదే ఆమెకు ఫస్ట్ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా. ఈ సినిమాలో గజియాబాద్‌ అమ్మాయి ఇందూ గుప్తా పాత్రలో నటిస్తోంది కియారా. డేటింగ్‌ యాప్‌ల నేపథ్యంతో అబిర్‌ సేన్‌గుప్తా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

  English summary
  Bollywood star heroine Kiara Advani palyed leed role in Arjun Reddy remake Kabir Singh and Laxmi bomb. Now she is hot topic in bollywood people voice. She is presently busy with Lakshmi Bomb shooting.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X