Just In
- 6 min ago
ఆ సినిమాలోలా రెచ్చిపోయిన జబర్ధస్త్ కమెడియన్: అసలైన రొమాన్స్ చూపిస్తా అంటూ ఆమెను నలిపేశాడు!
- 1 hr ago
2022 సంక్రాంతి ఫైట్: పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో పాటు మరో అగ్ర హీరో
- 1 hr ago
18 నెలల కాపురం.. ప్రెగ్నెన్సీ కూడా.. లాక్డౌన్లో ఆ కారణంగా డిప్రెషన్: నాగార్జున షాకింగ్ కామెంట్స్
- 2 hrs ago
అక్కడి టాటూను పవన్ చూశారు.. ఆఫర్ చేయడంతో రెండు గంటలు: ఆ ఫోటోతో మేటర్ రివీల్ చేసిన అషు రెడ్డి
Don't Miss!
- News
నక్కతోక తొక్కిన ప్రశాంత్ కిషోర్: జగన్ రాజకీయ వ్యూహకర్తకు భలే ఆఫర్: సీఎం చీఫ్ అడ్వైజర్‌గా
- Sports
India vs England: వాన్, కుక్.. బ్రాడ్ 8/15 ప్రదర్శనపై ఎందుకు మాట్లాడడం లేదు: ఓజా
- Automobiles
వాహ్.. కేవలం 18 గంటల్లో 25.54 కిమీ రోడ్డు పూర్తి.. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
- Finance
టెలికం స్పెక్ట్రం వేలం, అంచనాలకు మించి భారీగా బిడ్స్: పోటీలో ఈ కంపెనీలు
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి వ్యాపారులు ఈరోజు ఆర్థిక నష్టాన్ని భరించాలి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రియుడి ఇంట్లో పట్టుబడ్డ కియారా అద్వానీ.. మీడియా నుంచి తప్పించుకొంటూ..
బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లో తన గ్లామర్‌తో ఆకట్టుకొంటున్న కియారా అద్వానీ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తూ హల్‌చల్ చేస్తున్నారు. తన సినిమాల విషయంలో వార్తల్లో ఉంటున్నారనుకొంటే పప్పులో కాలేసినట్టే.. తన సినిమాలో కంటే ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో చెట్టాపట్టాలేసుకొని మీడియా కెమెరాకు చిక్కుతున్నారు. తాజాగా కియారా అద్వానీ తన ప్రియుడి ఇంట్లో ఉండగా మీడియా తమ కెమెరాలతో క్లిక్ మనిపించారు. ఆ వివారాల్లోకి వెళితే..

టాలీవుడ్‌లో మహేష్, రాంచరణ్
టాలీవుడ్‌లో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో తన గ్లామర్ పంట పండించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో జతకట్టి మంచి మార్కులే కొటేసింది. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ సినిమాల్లోనే ఉంటూ తెలుగు ప్రేక్షకులకు ముఖం చాటేసింది.

బాలీవుడ్‌లో వరుస హిట్లతో
ఇక హిందీలో కబీర్ సింగ్‌తో భారీ హిట్‌ను సొంతం చేసుకొన్న కియారా అద్వానీ.. అంగ్రేజ్ మీడియంతో మరో హిట్‌ను సొంతం చేసుకొన్నది. ఆ తర్వాత లక్ష్మీ, ఇందూకీ జవానీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమెకు నిరాశను పంచాయి.

ప్రియుడు సిద్ధార్థ మల్హోత్రాతో
ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రియుడు సిద్ధార్థ మల్హోత్రాతోనే షెర్షా సినిమా కోసం జతకట్టింది. అప్పటి నుంచి వారి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతోపాటు ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ కూడా జోరుగా నడుస్తున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూత కూస్తున్నది. అయితే ఈ ఇద్దరు ప్రేమ పక్షులు మాత్రం తమ అఫైర్, డేటింగ్ వార్తలపై పెదవి విప్పడం లేదు.

ప్రియుడి ఇంట్లోకి వెళ్తూ కియారా అద్వానీ
సిద్దార్థ్ మల్హోత్రా డేటింగ్ రూమర్లు జోరుగా ప్రచారం అవుతుండగా.. ఇటీవల మాల్దీవుల పర్యటకు వెళ్లింది. అంతటితో ఆగకుండా తాజాగా కియారా అద్వానీ తన ప్రియుడి ఇంటిలోకి వెళ్తూ మీడియాకు చిక్కింది. ఆదివారం బాద్రాలోని సిద్ధార్థ్ ఇంటిలోకి దూరుతుండగా మీడియా కెమెరాలు ఆమెను తమ ఫ్రేమ్‌లో బంధించాయి.

కియారా అద్వానీ కెరీర్
లాక్‌డౌన్ తర్వాత కియారా కెరీర్ గ్రాఫ్ రివ్వును ఎగిరిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. ప్రియుడు సిద్దార్థతో షేర్షాతోపాటు భూల్ భులయ్యా, జగ్ జగ్ జీయో చిత్రాల్లో నటిస్తున్నది. దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నట్టు దాఖాలలు కనిపించడం లేదు.