అలాంటివే కాదు.. ఇలాంటి వాటిలోనూ ముందుంటా అనేలా లస్ట్ భామ.. వైరల్ పిక్
సాధారణంగా సినీ సెలబ్రిటీలు అంటే రంగురంగుల ప్రపంచంలో అద్దాల మేడలు, ఆడి కార్లు లాంటి విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు. కానీ కొందరు సెలెబ్రిటీలు కొన్ని సందర్భాల్లో ఇందుకు భిన్నం అన్నట్లుగా వ్యవహరించి షాకిస్తుంటారు. తాజాగా అలాంటి ఓ షాక్ ఇచ్చింది లస్ట్ భామ కియారా అద్వానీ.
బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు లస్ట్ భామగా నెటిజన్లందరికీ సుపరిచితం కియారా అద్వానీ. తాజాగా ఈ భామ ఓ ఆటోలో కనిపించి షాకిచ్చింది. ఆ ఆటోలో ఆమె షూటింగ్‌కు వెళుతోందట. ఇందులో ఆమెతో పాటు కొరియోగ్రాఫర్ షబినా ఖాన్ కూడా ఉంది. ఈ ఇద్దరూ కలిసి ముంబై వీధుల్లో ఆటోలో వెళుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో అక్షయ్‌తో కలిసి చేస్తున్న లక్ష్మీబాంబ్ షూటింగ్ స్పాట్‌కు వెళ్లేందుకు ఇలా ప్లాన్ చేసి తనలో హాట్ నెస్ ఒక్కటే కాదు సింప్లిసిటీ కూడా ఉందని, తాను ఓ సాధారణ మహిళతో సమానమే అని చెప్పకనే చెప్పింది కియారా.

భరత్ అనే నేను సినిమా తెలుగులో కియారా అద్వానీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. మొదటి సినిమానే అయినప్పటికీ ఈమె అందానికి తెలుగు యువత ఫిదా అయ్యారు. మొదట మహేష్ సరసన వయ్యారాలు ఒలకబోసిన ఆమె.. వెంటనే వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్‌తో రొమాన్స్ చేసింది. ఇక ఇటీవలే అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో హీరోయిన్‌గా మెప్పించిన ఈ లస్ట్ భామ.. ప్రస్తుతం గుడ్‌న్యూస్, లక్ష్మీబాంబ్, షేర్‌షా, మర్‌జావా చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











