మెగా హీరోను పట్టేస్తున్న కియారా అద్వానీ.. సెన్సేషనల్ ప్రాజెక్ట్‌పైనే టార్గెట్.. దిల్ రాజు రంగంలోకి!

దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరో సెన్సేషనల్ ప్రాజెక్టు సిద్ధం కాబోతున్నది. ఎన్నో సంచలన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నదనే వార్త దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోయిన్ ఎవరనే ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు రెడీ అయ్యిందనే విషయం మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఈ క్రమంలో శంకర్, రాంచరణ్ ప్రాజెక్టు వివరాలు, హీరోయిన్ ఎంపిక సంబంధించిన విషయాలు మీ కోసం..

 అత్యున్నత సాంకేతికంగా రాంచరణ్15

అత్యున్నత సాంకేతికంగా రాంచరణ్15

రాంచరణ్15 అనే తాత్కాలిక టైటిల్‌తో ప్రచారంలో ఉన్న శంకర్ సినిమా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందనున్నది. కథా పరంగా ఎమోషనల్ డ్రామా తెరకెక్కనున్నది. రాంచరణ్ ఇమేజ్‌కు, శంకర్ ప్రమాణాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

2023 సంక్రాంతి బరిలో రాంచరణ్

2023 సంక్రాంతి బరిలో రాంచరణ్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే Ramcharan15 సినిమా జూన్ 2021లో మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పీ ప్రొడక్షన్ పనులు జోరందుకొన్నాయి. వచ్చే ఏడాది అంటే 2022 డిసెంబర్ కల్లా పూర్తి చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాంచరణ్ సినిమా 2023 ఆరంభంలో అంటే సంక్రాతికి రిలీజ్ కావడానికి స్కోప్ ఉంది అని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

కియారా అద్వానీతో దిల్ రాజు చర్చలు

కియారా అద్వానీతో దిల్ రాజు చర్చలు

రాంచరణ్, శంకర్, దిల్ రాజు కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో నటీనటుల ఎంపిక ప్రారంభమైంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కియారా అద్వానీతో సంప్రదింపులు జరుపుతున్నారు. కియారా అద్వానీ కూడా ఈ సినిమాలో నటించేందుకు సుముఖంగా ఉన్నారు. త్వరలోనే కియారా అద్వానీ ఎంపిక గురించి అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

రాంచరణ్‌తో కియారా రెండోసారి

రాంచరణ్‌తో కియారా రెండోసారి

రాంచరణ్‌తో కియారా అద్వానీ నటించడం ఇది మొదటిసారి కాదు. గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన వినయ విధేయ రామ చిత్రంలో వారిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమాలో చెర్రీ, కియారా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి మార్కులే పడిన సంగతి తెలిసిందే.

Recommended Video

Harbhajan Singh Says Yes For Ranveer Singh, Geeta Basra Disagrees
కియారా అద్వానీ కెరీర్ ఇలా

కియారా అద్వానీ కెరీర్ ఇలా

కియారా అద్వానీ కెరీర్ విషయానికి వస్తే.. కబీర్ సింగ్‌తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొన్న ఈ బ్యూటీకి లక్ష్మీ మూవీతో నిరాశను మూటగట్టుకొన్నారు. ప్రస్తుతం హిందీలో షెర్షా, భూల్ భులయ్యా 2, జగ్ జగ్ జీయో సినిమాల్లో నటిస్తున్నారు. రాంచరణ్‌తో మూవీ సెట్ కావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X