మరో స్టార్ హీరోతో రొమాన్స్.. కైరా అద్వానీకి బంపర్ ఆఫర్!
బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ టాలీవుడ్ లో తొలి చిత్రంతోనే మహేష్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. భరత్ అనే నేను చిత్రంలో కైరా అద్వానీ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కైరా అద్వానీ గ్లామర్ కు యువత ఫిదా అవుతున్నారు. కైరా క్రేజ్ చూసి నిర్మాత డివివి దానయ్య రాంచరణ్ సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నాడు.
టాలీవుడ్ చిత్రంతో సౌత్ లోకి అడుగుపెట్టిన కైరాకు ఇప్పుడిప్పుడే కోలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. కైరా అడ్వాని తొలి తమిళ చిత్రంలోనే స్టార్ హీరో విజయ్ సరసన రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెర్సల్, తేరి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు అట్లీ విజయ్ తో మూడో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు.

ఈ చిత్రంలో కైరా అద్వానీని హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఒకే అయితే కైరా అద్వానీ తమిళ ఎంట్రీకి సరైన చిత్రం దొరికినట్లే. రాంచరణ్, కైరా అద్వానీ జంటగా నటించే చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











