‘నా కూతురు ఎవరితో డేటింగ్ చేసిన ఓకే.. పెళ్లి తప్పనిసరేం కాదు’

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కియారా, తక్కువ సినిమాలే చేసినప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. మహేష్ బాబు సరసన నటించిన ఆ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. అనంతరం బాలీవుడ్‌లో వరుస హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కియారా, రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే, బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడి 2023లో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగించినప్పటికీ, ఇటీవల కుటుంబ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. 2025 జూలైలో వీరికి కుమార్తె జన్మించడంతో, ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తుంది. అదే సమయంలో సెలక్టివ్ గా సినిమాల ఎంపిక చేసుకుంటుంది. త్వరలో యాష్ టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Kiara Advani s Bold Dating Views Spark Debate on Freedom Relationships amp amp Modern Values

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ కియారా ఆదానీ మాట్లాడుతూ, జీవితంలో భాగస్వామిని ఎంచుకునే ముందు వ్యక్తులు ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకోవడం అవసరమని అభిప్రాయపడింది. సంబంధాల విషయంలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలని, ప్రతి ఒక్కరికీ తమ జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు ఉందని ఆమె చెప్పింది.

ఈ సందర్భంలో కియారా మాట్లాడుతూ.. 'నా కూతురు తనకు నచ్చినంత మంది అబ్బాయిలతో డేటింగ్ చేయడానికి నేను అనుమతిస్తాను. తను డేటింగ్ చేసే అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, తనని తాను తెలుసుకుంటే చాలు. తాను కూడా పెళ్లి కాకముందుకు తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో అలాగే ఉన్నాననీ ఆమె చెప్పింది. ఎవరు కూడా బతకడం కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వరనీ, స్వతహాగా నేర్చుకుంటారని చెప్పుకొచ్చింది. పాత కాలంలో కఠిన పద్దతులుండేవనీ, అవి వ్యక్తి స్వేచ్ఛకు ఆటంకంగా ఉండేవని అన్నారు.

అయితే.. ఆ వ్యాఖ్యలను కొందరు "డేటింగ్ స్వేచ్ఛ"కు మద్దతుగా భావించగా, మరికొందరు వాటిని తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో కొందరు యూజర్లు ఈ వ్యాఖ్యలను అతిశయోక్తిగా చూపిస్తూ, అసభ్యకరమైన పదజాలంతో విమర్శలు చేయడం కూడా గమనార్హం. సంప్రదాయ విలువలు, కుటుంబ వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి విషయాలపై జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.మొత్తం మీద సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X