Tapsee X Jyothi Rai: తాప్సీకి జ్యోతి పూర్వజ్ స్ట్రాంగ్ కౌంటర్..నీకు నచ్చకపోతే అప్పుడే రిజెక్ట్ చేయాల్సింది..

బాలీవుడ్ నటి తాప్సీ పన్ను ఇటీవల సౌత్ ఫిల్మ్ మేకర్స్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది దర్శక, నిర్మాతలు నాభి ప్రదేశాన్ని, లేదా ప్యాడెడ్ బ్రాలు ధరించమని విసిగించి వేధించారు. సెట్స్‌లో చేదు అనుభవాలు ఎదురయ్యేవి. ఈ వ్యవహరాలు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువ. నాకు అలాంటి అనుభవాలు చాలా ఎదురయ్యాయి అంటూ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. దక్షిణాది సినీ ప్రముఖులపై తాప్సీ పన్ను చేసిన కామెంట్స్‌పై టెలివిజన్ యాక్టర్, కిల్లర్ మూవీ హీరోయిన్ జ్యోతి రాయ్ అలియాస్ జ్యోతి పూర్వజ్ ఘాటుగా స్పందించారు. ఫిల్మీబీట్ తెలుగు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ..

నీకు నచ్చకపోతే చేయకుండా ఉండొచ్చు. ఎప్పుడైనా రిజెక్ట్ చేయవచ్చు. ఆఫర్ కావాలంటే.. పక్కదార్లు పట్టాల్సి ఉంటుందనే టాక్ ఉండేది. నేను 15 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నటించాను. కానీ నా కెరీర్‌లో ఎప్పుడూ అలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు. ఎక్కడా నాకు అలాంటి సిచ్యుయేషన్ రాలేదు. ఎవరూ కూడా ఇబ్బంది పెట్టలేదు. డేట్స్, టైమింగ్స్ విషయంలో గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి. నాకు వ్యక్తిగతంగా వేధింపులు ఎదురు కాలేదు. ఆ విషయంలో నాకు భగవంతుడు మేలు చేశాడని అనుకొంటాను అని జ్యోతి పూర్వజ్ అభిప్రాయపడ్డారు.

Tapsee X Jyothi Rai

ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితులు ఎదురైతే.. వాటిని వెంటనే ఖండించాలి. అలాంటివి చేయకుండా ఉండాల్సింది. యాక్టింగ్ విషయంలో ఇబ్బంది పడితే మీరు మరో పని వెతుక్కోవచ్చు. మీరు చదువుకొన్న వారు కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. నాకు ఆడిషన్స్‌కు వెళ్లే అలవాటు లేదు. భగవంతుడి కృప వల్ల అవకాశాలు వెతుక్కొంటూ వచ్చాయి. ప్రతీ రోజు మూడు షిఫ్టులు పనిచేసిన రోజులు ఉన్నాయి అని జ్యోతి పూర్వజ్ చెప్పారు.

టెలివిజన్‌ సీరియల్స్‌తో బిజీగా ఉన్న సమయంలో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ నేను రిజెక్ట్ చేశాను. ఎందుకంటే నేను డేట్స్ సర్దుబాటు చేయలేకపోయాను. యంగ్ ఏజ్‌లో సినిమాల్లో నటించాలనే అవగాహన లేదు. ఎలా అప్రోచ్ అవ్వాలనే విషయం తెలిసేది కాదు. అయితే నన్ను బలవంతంగా ఓ విషయాన్ని నాపై రుద్దలేదు. అలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు అని జ్యోతి పూర్వజ్ అన్నారు.

గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతి క్యారెక్టర్ చేయాల్సి వచ్చినప్పుడు బెంగాళీలో ప్రసారమైన ఆ సీరియల్‌ను చూసిన తర్వాతే నేను ఒప్పుకొన్నాను. ఆ సమయంలో చిన్న వయసులోనే తల్లి పాత్రలను చేశాను. ఆ విషయంలోో నన్ను బాగా ట్రోల్ చేశారు. అయినా పట్టించుకోలేదు. ఇప్పుడు నాకు ఎలాంటి ఆఫర్ వచ్చినా ముందు నేను ఆలోచించుకొంటాను. నన్ను ఎవరు బలవంతం చేయలేరు. మీటూ ఉద్యమం సమయంలో అందరూ ఆ విషయం గురించి మాట్లాడారు. ఆ సమయంలో నీకు ఏదైనా లైంగిక వేధింపులు గురైతే వెంటనే స్పందించాలి. వాటిని బయటి ప్రపంచానికి చెప్పాలి అని జ్యోతి పూర్వజ్ అన్నారు.

Tapsee X Jyothi Rai

తాప్సీ పన్ను చేసిన కామెంట్స్‌పై జ్యోతి మాట్లాడుతూ.. ఒకసారి నీవు అలాంటి పాత్రలు, సన్నివేశాలు చేసిన తర్వాత వాటి గురించి మాట్లాడకూడదు. అప్పుడే నేను చేయనని చెప్పాలి. నిన్ను ఎవరైనా బలవంతం చేస్తే నేను చేయనని చెప్పాలి. అప్పడు అంతా చేసేసి ఇప్పుడు వాళ్లు ఇలా చేశారు? వీళ్లు ఇలాంటి పనులు చేయమని బలవంతం చెప్పారనడంలో మీనింగ్ లేదు. మీకు మీ తల్లిదండ్రులు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. సినిమా ఒకటే కాదు.. నీ కెరీర్‌ను 100 మార్గాల్లో వెతుక్కోవచ్చు. నీ తప్పులు చేసి ఎదుటి వాళ్లను తప్పు అంటే సరికాదు అని జ్యోతి పూర్వజ్ అన్నారు.

More from Filmibeat

Read more about: tapsee pannu Killer jyothi rai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X