మాజీ ప్రియుడితో మళ్లీ కలవాలని రష్మికపై ఒత్తిడి.. తనకు అభ్యంతరం లేదంటూ షాకిచ్చింది.!

By Manoj

ఆకట్టుకునే అందంతో పాటు అద్భుమైన నటనను కనబరచగలిగే టాలెంట్ ఉన్న నటీమణుల్లో కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఒకరు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. ఊహించని స్థాయిలో గుర్తింపుతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. గ్లామర్ పాత్రల కంటే యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్స్‌ను చేస్తుండడం వల్లే పాపులర్ అయిపోయింది. ఈ నేపథ్యంతో రష్మికను ఆమె మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టితో మరోసారి కలవాలని కొందరు ఒత్తిడి తెస్తున్నారట. ఈ న్యూస్ ప్రస్తుతం కన్నడ పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం.!

‘ఛలో’తో మొదలై సరిలేరు అనిపించుకుంది

‘ఛలో’తో మొదలై సరిలేరు అనిపించుకుంది


కర్నాటకకు చెందిన రష్మిక మందన్నా ‘కిర్రాక్ పార్టీ' అనే కన్నడ సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత అక్కడ కొన్ని చిత్రాల్లో నటించిన ఆమె.. నాగశౌర్య హీరోగా చేసిన ‘ఛలో'తో టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత ‘గీత గోవిందం', ‘దేవదాస్', ‘డియర్ కామ్రేడ్', ‘సరిలేరు నీకెవ్వరు', ‘భీష్మ' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

ముగ్గురు స్టార్ హీరోల కన్ను ఆమె మీదే.!

ముగ్గురు స్టార్ హీరోల కన్ను ఆమె మీదే.!

తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతోంది రష్మిక మందన్నా. ఈ క్రమంలోనే ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆమె సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘పుష్ప'లో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, చిరంజీవి ‘ఆచార్య'లో చరణ్‌కు జోడీగా ఎంపికైంది. ఇక, తారక్ - త్రివిక్రమ్ సినిమాకూ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

హీరో విజయ్‌ దేవరకొండతో ప్రేమాయణం

హీరో విజయ్‌ దేవరకొండతో ప్రేమాయణం

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో రష్మిక ఒకరన్న విషయం తెలిసిందే. ఆమె టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంటున్నారు. దీన్ని ఈ ఇరువురూ ఎన్ని సార్లు ఖండించినా ఫలితం లేకుండా పోయింది.

తెలుగులోకి వచ్చిన రష్మిక మాజీ ప్రియుడు

తెలుగులోకి వచ్చిన రష్మిక మాజీ ప్రియుడు

తన మొట్టమొదటి కో స్టార్, కన్నడ హీరో రక్షిత్ శెట్టితో రష్మిక మందన్నా ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. అంతేకాదు, వీళ్లిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో వివాహానికి ముందు విడిపోయారు. దీంతో ఈ జంట దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. రక్షిత్ కొద్ది రోజుల క్రితం ‘అతడే శ్రీమన్నారాయణ' అనే మూవీతో తెలుగు వాళ్లకు పరిచయమయ్యాడు.

రక్షిత్‌తో మరోసారి కలవబోతున్న రష్మిక

రక్షిత్‌తో మరోసారి కలవబోతున్న రష్మిక

సుదీర్ఘమైన ప్రేమ బంధానికి బ్రేకప్ చెప్పి.. రక్షిత్‌తో విడిపోయింది రష్మిక మందన్నా. ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత ఈ జంట మరోసారి కలవబోతుందట. అయితే, అది రియల్ లైఫ్‌లో మాత్రం కాదు.. గతంలో వీళ్లిద్దరూ కలిసి నటించిన ‘కిర్రాక్ పార్టీ'కి సీక్వెల్‌గా వస్తున్న సినిమా కోసం అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ జంట మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది.

రష్మికకు షాకిస్తూ క్లారిటీ ఇచ్చిన రక్షిత్

రష్మికకు షాకిస్తూ క్లారిటీ ఇచ్చిన రక్షిత్


త్వరలోనే పట్టాలెక్కబోతున్న ‘కిర్రాక్ పార్టీ 2' గురించి రక్షిత్ శెట్టి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అందరూ అనుకుంటున్నట్లు ‘కిర్రాక్ పార్టీ' సీక్వెల్‌లో రష్మిక హీరోయిన్ కాదు. ఆమె స్థానంలో మరో కొత్త అమ్మాయిని తీసుకుంటున్నాం' అని చెప్పి షాకిచ్చాడు. దీంతో అతడు రష్మికతో మరోసారి కలవకూడదని డిసైడ్ అయిపోయాడని జోరుగా ప్రచారం జరిగింది.

Recommended Video

Rashmika Mandanna Childhood Magazine Picture Gone Viral
మాజీ ప్రియుడితో కలవాలని రష్మికపై ఒత్తిడి

మాజీ ప్రియుడితో కలవాలని రష్మికపై ఒత్తిడి

రక్షిత్ శెట్టి క్లారిటీ ఇచ్చినప్పటికీ... ‘కిర్రాక్ పార్టీ 2' విషయంలో తాజాగా మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాలో నటించాలని రష్మికపై ఆ చిత్ర యూనిట్ ఒత్తిడి తెస్తుందట. దీంతో రక్షిత్‌కు ఓకే అయితే.. తనకు అభ్యంతరం లేదని ఆమె వెల్లడించినట్లు శాండిల్‌వుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు హీరోను ఒప్పించే పనిలో ఉన్నారట ఫిల్మ్ మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X