twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Meera Mithun జైలు నుంచి విడుదల.. 30 రోజల తర్వాత బయటకు.. తేడా వస్తే కటకటాలే..

    |

    నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో మీడియాలో ఫోకస్ అయ్యే మీరా మిథున్ ఇటీవల జైలుపాలైన విషయం తెలిసిందే. తమిళ్ ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ఈ బ్యూటీ తరచుగా ఇతర స్టార్స్ పై ఎదో ఒక విధంగా కామెంట్ చేస్తూ చిక్కుల్లో పడుతోంది. ఇక గతంలో ఒక కాంట్రవర్సీ వీడియో రిలీజ్ చేసిన మీరా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక నెల రోజుల పాటు జైలు జీవితం గడిపిన ఆమెకు ఫైనల్ గా బుదవారం రోజు ఆమెకు అదృష్టవశాత్తూ బెయిల్ లబించింది. ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా ఈ కేసులో ఉండగా అతనికి కూడా బెయిల్ మంజూరు చేశారు.

    Bigg Boss Telugu 5 Promo: ఆమె విషయంలో పెద్ద తప్పు చేసిన షణ్ముఖ్.. హౌస్‌లో షాకింగ్ విజువల్స్Bigg Boss Telugu 5 Promo: ఆమె విషయంలో పెద్ద తప్పు చేసిన షణ్ముఖ్.. హౌస్‌లో షాకింగ్ విజువల్స్

    బడా స్టార్స్ పై వివాదాస్పదంగా..

    బడా స్టార్స్ పై వివాదాస్పదంగా..

    మీరా మిథున్ కు గొడవలు కొత్తేమి కాదు. ఆమె కోలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అగ్ర హీరోలందరిపై వివదస్పదంగా వ్యాఖ్యలు చేసింది. రజనీకాంత్, సూర్య, విజయ్ వంటి హీరోలతో పాటు జ్యోతిక, త్రిష వంటి వారిపై కూడా ఎవరు ఊహించని విధంగా విమర్శలు చేయడంతో పరువు నష్టం దావా కేసులో కూడా ఇరుక్కోవాల్సి వచ్చింది.

    కులాలపై వివదస్పదంగా..

    కులాలపై వివదస్పదంగా..

    వీసీకే ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) మరియు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగ (అరాచకాల నిరోధం) చట్టం యొక్క ఏడు నిబంధనల ప్రకారం ఆమెపై కేసు నమోదైంది. ఇక అసలు విషయంలోకి వెళితే.. నటి మీరా మిథున్ మరియు ఆమె ప్రియుడు అభిషేక్ కులాలపై పరువు నష్టం కలిగించే వీడియోను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో పోస్ట్ చేసిన ఫిర్యాదుపై ఆగస్టు 14 న అరెస్టు చేశారు.

    కేసు నమోదు..

    కేసు నమోదు..

    వైరల్‌గా మారిన వీడియోలో షెడ్యూల్డ్ కులాల (ఎస్‌సి) పై దుష్ప్రచారం చేసినందుకు సైబర్ వింగ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. హింస నిరోధక చట్టంలోని 7 సెక్షన్ల కింద అల్లర్లను ప్రేరేపించడంతో సహా వారిపై అభియోగాలు మోపారు. ప్రాసిక్యూషన్ కేసు ప్రకారం ఆ వీడియో ఫుటేజీని సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఇది మొత్తం షెడ్యూల్ కులాలను అవమానించినట్లు ఉండడంతో వారిపై కేసు నమోదు చేశారు.

    నెల రోజుల పాటు జైలులో

    నెల రోజుల పాటు జైలులో

    ఇక 'తప్పు చేయడం మానవ స్వభావం అని భావించి చెన్నై కోర్టు బుధవారం నటుడు మీరా మిథున్ అలియాస్ తమిళ్ సెల్వి మరియు ఆమె సహచరుడికి బెయిల్ మంజూరు చేసింది. సుమారు వాళ్ళు ఒక నెల పాటు జైలులో ఉన్నారు. ఇక బెయిల్ సమయంలో శిక్షా నిబంధనలు అమలు చేయబడవు. విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ దీనిని నిరూపించగలదు. వారు ఐదు వారాల పాటు నిర్బంధంలో ఉన్నందున మరియు తప్పు చేయడం మానవ స్వభావం కాబట్టి, ఈ కోర్టు బెయిల్ మంజూరు చేయడానికి మొగ్గు చూపుతుందని ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఆర్. సెల్వకుమార్ చెప్పారు.

    Recommended Video

    Kangana Ranaut True Admirer Of Jayalalitha | Thalaivii Interview
    మరోసారి హెచ్చరించిన న్యాయస్థానం

    మరోసారి హెచ్చరించిన న్యాయస్థానం

    తదనుగుణంగా, పిటిషనర్లు కోర్టు సంతృప్తి కలిగించే మొత్తానికి రెండు పూచీకత్తులతో ఒక్కొక్కరికి రూ .10,000 చొప్పున బాండ్ దాఖలు చేసినప్పుడు బెయిల్‌ పై విడుదల చేయాలని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వారు ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు పోలీసుల ముందు హాజరుకావాలి మరియు విచారణ లేదా విచారణ సమయంలో సాక్ష్యాలు లేదా సాక్ష్యాలను తారుమారు చేయరాదని కోర్టు హెచ్చరిక చేసింది. ఇక విచారణ లేదా విచారణ సమయంలో వారు తప్పించుకోకూడదు. ఈ షరతులలో దేనినైనా ఉల్లంఘిస్తే, ట్రయల్ కోర్టు చట్టానికి అనుగుణంగా వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా తెలియజేశారు.

    English summary
    Kollywood Actress Meera mithun and her friend granted bail by Chennai high court
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X