హీరోయిన్‌ను అలా ట్రీట్ చేస్తారు.. అందుకే తెలుగు సినిమాలకు దూరం.. ఐశ్వర్య రాజేశ్ సంచలన వ్యాఖ్యలు
Aishwarya Rajesh: సాధారణంగా సినిమాలో హీరోయిన్ అంటే అందం, అభినయం ఉండాలని భావిస్తాం. టాలెంట్ ఉన్నా.. అందంగా లేకపోతే.. అవకాశాలు రావడం కష్టమే. అవసరమైతే.. గ్లామర్ షో చేస్తూ మాస్ స్టెప్పులు వేస్తూ ధియేటర్స్ ని షేక్ చేయాలి. అప్పుడే మూవీ మేకర్స్ లూక్స్ వారిపై పడుతాయి. కెరీర్ ప్రారంభంలో మేకర్స్ చెప్పినట్టు వినాలి. వాళ్లు అడిగినట్టు చేయాల్సిందే. అలా అయితేనే క్రేజీ ఛాన్సులు అందుకుంటున్నారు. అలాంటి భావనతోనే ఓ అమ్మడు సినిమాలకు దూరమైంది. ఇంతకీ తెలుగు సినిమాలకు దూరమైన హీరోయిన్ ఎవరో ఓ లూక్కేయండి.
ఈ బ్యూటీ ఎవరో కాదు.. కోలివుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఆమె ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. టాలీవుడ్ హీరోయిన్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ' తెలుగు సినిమా వాళ్లకి హీరోయిన్స్ అంటే తెల్లగా ఉండాలి. సన్నగా ఉండాలి అనే భావన తనలో ఉండేది. తెలుగు హీరోయిన్స్ అంటే పై నుండి దిగివచ్చిన దేవతల ఉండాలనే భావన తనకుండేది. తాను తెలుగు సినిమాలకు పనికిరాని, చాలా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నాను. ' అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

హీరోయిన్ ఐశ్యర్య రాజేష్ ఇంకా మాట్లాడుతూ.. ' ఈ సందర్భంలో వర్డల్ ఫేమస్ లవర్ మూవీలో 'సువర్ణ' అనే క్యారెక్టర్ వచ్చింది. ఆ క్యారెక్టర్ తనకు కరెక్ట్ గా సెట్ అయ్యే విధంగా ఉందనే ఫీలింగ్ తోనే ఆ క్యారెక్టర్ చేశాను. కానీ, ఆ సినిమా అంత హిట్ కాలేదు. కానీ, తాను చేసిన క్యారెక్టర్ మాత్రం జనాలలోకి వెళ్లింది. ఈరోజు కూడా ఆ క్యారెక్టర్ చాలామంది ఇష్టపడుతున్నారు. తన డైలాగ్స్ పై రీల్స్ చేస్తున్నారు' అంటూ సంతోషం వ్యక్తం చేసింది.
'నిజంగా సువర్ణ అనే యాక్టర్ ను అభిమానులు ఎంతగానో అభిమానించారు. ఆ క్యారెక్టర్ చేసేటప్పుడూ ఎలాంటి మేకప్ వేసుకోలేదు. చాలా డీ గ్లామర్ గా పాత నైటీలు, చీరలు కట్టుకున్నాను. పైగా ఐదు నెలల బాబును ఎత్తుకొని నటించడం చాలా కష్టంగా అనిపించింది' అంటూ తన క్యారెక్టర్ గురించి చెప్పుకొచ్చారు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ .

ఆ క్యారెక్టర్ ను చూసి తనని 'జిడ్డు మొఖంది'.. అంటూ హీరో విజయ్ చాలా కామెంట్ చేశారు. తొలుత అసలు ఆ క్యారెక్టర్లు ఆదరిస్తారా? లేదా ? అని అనుమానపడ్డాను. కానీ, తెలుగు ప్రేక్షకులకు ఆ ఎంతగానో ఆదరించారు. వాస్తవానికి ప్రేక్షకులకు మనమే అలవాటు చేసాం.. హీరోయిన్ అంటే తెల్లగా ఉండాలి అందంగా ఉండాలి సన్నగా ఉండాలి అని మనమే అలవాటు చేసాం అని షాకింగ్ కామెంట్స్ చేశారు.
'తెలుగులో సౌందర్య, భానుప్రియ, రాధిక వంటి హీరోయిన్స్ ఎంతో సహజంగా నటించారు. అందుకే వారిని ఇప్పటికి కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఒకసారి తెలుగు ప్రేక్షకులకు నచ్చితే వాళ్లు ఆదరించినట్లుగా ప్రపంచంలో ఏ ప్రేక్షకులు కూడా ఆదరించలేరు' అంటూ ఐశ్వర్య రాజేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.


Click it and Unblock the Notifications











