లాడ్జిలో సీనియర్ హీరోయిన్ నిర్వాకం.. పోలీసుల దృష్టికి వ్యవహారం.. కేసు నమోదు

తమిళ చిత్ర పరిశ్రమలో వివాదాస్పద నటి విజయలక్ష్మీపై పోలీస్ కేసు నమోదైంది. గత కొద్ది నెలలుగా అనేక వివాదాల్లో చిక్కుకున్న తాజాగా మరో కేసులో బుక్ కావడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించకపోవడంతో నటి వ్యవహారం మరింత ముదిరిందనే వాదన వ్యక్తమవుతున్నది. సీనియర్ హీరోయిన్ విజయలక్ష్మీపై దాఖలైన కేసు ఏమిటంటే..

పలు వివాదాల్లో విజయలక్ష్మీ

పలు వివాదాల్లో విజయలక్ష్మీ

కోలీవుడ్‌లో టాప్ హీరోలు విజయ్, సూర్య కలిసి నటించిన ఫ్రెండ్స్ అనే చిత్రంతో విజయలక్ష్మీ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత దక్షిణాదిలో తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలో పలు సినిమాల్లో నటించారు. అయితే పలు సందర్భాల్లో రకరకాల సమస్యల్లో కూరుకుపోయి హీరోయిన్ పాత్రలకు దూరమయ్యారు.

రాజకీయ నేత వాడుకొని వదిలేశాడని...

రాజకీయ నేత వాడుకొని వదిలేశాడని...

అయితే విజయలక్ష్మి ఇటీవల ఓ రాజకీయ నాయకుడిపై వివాదాస్పద ఆరోపణలు చేయడం ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చారు. నామ్ తమీజర్ కచ్చి నేత సీమాన్‌తో నాకు అఫైర్ ఉంది. తనను వాడుకొని వదిలేశాడు. తనను నమ్మించి మోసం చేశాడు అంటూ ఆరోపణలు చేయడంతో తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో బెంగళూరు నుంచి చెన్నైకి మకాం మార్చిన ఈ నటి తిరువన్‌మియూర్ అనే లాడ్జిలో ఉంటున్నారు.

లాడ్జిలో ఆత్మహత్యాయత్నం

లాడ్జిలో ఆత్మహత్యాయత్నం

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో కూడిన పోస్టులు పెడుతున్నారని సీమాన్‌‌పై భగ్గుమన్నది. తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్ర పన్నారు. ఈ వ్యవహారంలో తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. రాజకీయ నేత సీమాన్‌తో వివాదం నెలకొన్న సమయంలో చెన్నైలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యాయత్నం చేసుకోవడం మరో వివాదానికి తెరలేపింది.

Recommended Video

Happy Birthday Maniratnam : Maniratnam Biggest Multistarer Plan Got Shelved
లాడ్జి అద్దె చెల్లించకుండా

లాడ్జి అద్దె చెల్లించకుండా

రాజకీయ నేత సీమాన్‌తో గొడవ పక్కన పెడితే.. తిరువన్‌మియూర్‌లోని లాడ్జి యజమాని తాజాగా విజయలక్ష్మిపై పోలీస్ కేసు నమోదు చేశారు. కొద్దినెలలుగా తనకు అద్దె చెల్లించడం లేదు. దాదాపు 3 లక్షల రూపాయలు నాకు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తాన్ని ఆమె నుంచి ఇప్పించండి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాడ్జి యజమాని ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X