మ్యూజిక్ డైరెక్టర్‌గా స్టార్ హీరోయిన్.. ఇలాగైనా సక్సెస్ అవుతుందా?
స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి శృతి హాసన్. కెరీర్ మొదట్లో ఈ బ్యూటీ ఐరెన్ లెగ్ అనే ముద్రతో కాస్త నిలదొక్కుకోవడానికి సతమతమైంది. ఫైనల్ గా గబ్బర్ సింగ్ హిట్టుతో కెరీర్ ని సెట్ చేసుకొని అటు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకుంది. ఇక ఈ బ్యూటీకి సంగీతం అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే.
ఈ మధ్య శృతి హాసన్ కి హీరోయిన్ గా అవకాశాలు చాలా వరకు తగ్గాయి. మంచి కథల కోసం సెర్చ్ చేసే ప్రయత్నంలో అమ్మడు కొన్ని ప్రాజెక్టులను రిజెక్ట్ చేసిందట. అసలు మ్యాటర్ లోకి వస్తే.. లాక్ డౌన్ లో ఈహీరోయిన్ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేయాలని అమ్మడు టార్గెట్ సెట్ చేసుకుందట. కొత్త టెక్నీషియన్స్ తో తెరకెక్కుతున్న ఒక చిన్న బడ్జెట్ సినిమాకు శృతి హాసన్ పూర్తి స్థాయిలో సంగీతం అందించడానికి రెడీ అవుతోందట.

గతంలోనే ఈ బ్యూటీ తన తండ్రి కమల్ హాసన్ ఈనాడు సినిమాకు ఒక పాటను కంపోజ్ చేసింది. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే చాలా కాలం తరువాత శృతి పూర్తిగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమాలోని అన్ని పాటలను కంపోజ్ చేసి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇవ్వాలని డిసైడ్ అయ్యిందట. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో శృతి బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











