మెగాస్టార్ 152.. రేసులో కాలా హీరోయిన్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. స్వాతంత్ర పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పట్ల అభిమానులంతా ఆసక్తిగా ఉన్నారు.
2019 వేసవి కానుకగా సైరా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దర్శకుడు కొరటాల ఇప్పటికే మెగాస్టార్ 152 చిత్రానికి సంబంధించి వర్క్ ప్రారంభించేశారు. నాలుగు వరుస హిట్లతో పరాజయమే లేకుండా కొరటాల దూసుకుపోతున్నారు. ఈనేపథ్యంలో కొరటాల, చిరు కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రానికి సంబంధించి అభిమానులు ఆసక్తి నెలకొనడం సహజం.

ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన నటించే హీరోయిన్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఇటీవల అనుష్క, శ్రీయ అంటూ పలువురి సీనియర్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా క్యురేషి కూడా రేసులోకి వచ్చినట్లు తెలుస్తోంది. సౌత్ బిగ్గెస్ట్ స్టార్ రజని సరసన కాలా చిత్రంలో నటించిన హ్యూమా క్యురేషి మంచి గుర్తింపు దక్కించుకుంది.


Click it and Unblock the Notifications











