బికినీలో కొత్త బంగారు లోకం హీరోయిన్.. బీచ్‌లో అందాల సునామీనే!
తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే మొదటి చిత్రంతోనే సంచలనంగా మారిపోయారు. అలాంటి వారిలో శ్వేత బసు ప్రసాద్ ఒకరు. తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. దీన్ని ఎక్కువ కాలం పాటు కంటిన్యూ చేసుకోలేకపోయింది.
దీనికితోడు మధ్యలో ఓ వివాదం కారణంగా ఆమె కెరీర్‌కు బ్రేక్ పడింది. ఆ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన ఈమె ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ రచ్చ లేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్వేత ఓ బోల్డు పిక్ షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

అలా ఎంట్రీ.. తెలుగులోకి: జార్ఖండ్‌కు చెందిన శ్వేత బసు ప్రసాద్ మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. అలా చాలా కాలం పాటు సందడి చేసిన ఈ భామ.. 'మక్డీ' అనే మూవీతో నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత 'ఇక్బాల్' మూవీతో హీరోయిన్‌గా మారి చాలా చిత్రాల్లో నటించింది. అనంతరం 'కొత్త బంగారు లోకం' చిత్రంతో తెలుగులోకి ఎంటరైంది. ఇందులోని నటనతో సంచలనంగా మారింది.

ఆ మూవీలు చేసి బిజీగానే: టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న శ్వేత బసు ప్రసాద్.. ఆ తర్వాత వరుసగా ఆఫర్లను దక్కించుకుంది. ఈ క్రమంలోనే 'రైడ్', 'కాస్కో', 'కళావర్ కింగ్', 'ప్రియుడు', 'జీనియస్' వంటి సినిమాల్లో నటించింది. అలాగే, తమిళం, హిందీ భాషల్లోనూ చాలా చిత్రాలు చేసింది. ఇలా సుదీర్ఘ కాలం పాటు శ్వేత బసు ప్రసాద్ హీరోయిన్‌గా హవాను చూపించింది.

ఆ వివాదాలతో సెన్సేషన్: వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్న సమయంలోనే శ్వేత బసు ప్రసాద్ ఓ కేసులో అరెస్ట్ అయింది. ఇది దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయింది. దీంతో ఆమె కెరీర్‌కు ఒక్కసారిగా బ్రేక్ పడిపోయింది. ఈ వివాదం నుంచి కోలుకున్న శ్వేత ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్‌ను వివాహం చేసుకుంది. కానీ, ఏడాదిలోపే వీళ్లిద్దరూ విడాకులు తీసుకుని దూరం అయిపోయారు.
సెకెండ్ ఇన్నింగ్స్ రచ్చ: అరెస్ట్ అవడంతో పాటు విడాకులు తీసుకుని వరుస దెబ్బలు తిన్న శ్వేత బసు ప్రసాద్.. సెకెండ్స్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ముఖ్యంగా వెబ్ ఫిల్మ్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ సత్తా చాటుతోంది. అంతేకాదు, తెలుగులోనూ సినిమాలు చేసేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే ఓ మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

సోషల్ మీడియాలో చిల్: ఈ మధ్య కాలంలో వరుసగా ఆఫర్లను అందుకుంటోన్న శ్వేత బసు ప్రసాద్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా హల్చల్ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ నిత్యం తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా క్రేజ్‌ను పెంచుకోవడంతో పాటు అభిమానులను కూడా ఖుషీ చేసేస్తోంది.
గ్లామర్ ట్రీట్ ఇస్తోందిగా: చాలా కాలంగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న శ్వేత బసు ప్రసాద్.. ఈ మధ్య మాత్రం తరచూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను పంచుకుంటోంది. ఇలా తన గ్లామర్‌తో శ్వేత బసు ప్రసాద్ ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది. అదే సమయంలో తరచూ హెడ్‌లైన్ అయిపోతోంది.

శ్వేత అందాల సునామీ: సెన్సేషనల్ హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ బోల్డు ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె టూపీస్ బికినీలో దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫొటోలో ఆమె అందాలు మొత్తం చూపరులను ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా శ్వేత బసు ప్రసాద్ షేర్ చేసిన ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











