కొత్త బంగారు లోకం హీరోయిన్ కిల్లింగ్ సెల్ఫీ.. సినిమాల్లో అలా రియల్‌గా ఘాటుగా!
తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్లుగా పరిచయమైన వారిలో అతి తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే సంచలనంగా మారిపోయారు. అలాంటి వారిలో ముద్దుగుమ్మ శ్వేత బసు ప్రసాద్ ఒకరు. 'కొత్త బంగారు లోకం' అనే చిత్రంతో హాట్ టాపిక్ అయిన ఈ భామ.. తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించింది. కానీ, వివాదాల్లో చిక్కుకోవడంతో ఒడిదుడుకులను ఎదుర్కొంది. అలాంటిది ఈ మధ్య మళ్లీ వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. ఇక, సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న శ్వేత బసు ప్రసాద్.. తాజాగా ఓ ఘాటు సెల్ఫీని షేర్ చేసింది. దానిపై మీరు కూడా లుక్కేయండి!
ఒకే సినిమాతో ఫుల్ ఫేమస్:మోడల్‌గా ఫుల్ పాపులర్ అయిన తర్వాత శ్వేత బసు ప్రసాద్‌కు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడు 'మక్డీ' అనే మూవీతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'ఇక్బాల్' మూవీతో హీరోయిన్‌గా మారి చాలా చిత్రాలను చేసింది. అనంతరం 'కొత్త బంగారు లోకం' చిత్రంతో తెలుగులోకి వచ్చింది. ఈ మూవీతో ఆమె ఫుల్ ఫేమస్ అయిపోయింది.

ఆ మూవీలు చేసి బిజీగానే:టాలీవుడ్‌లో ఒక్క మూవీతోనే సెన్సేషన్ అయిన శ్వేత బసు ప్రసాద్.. ఆ తర్వాత వరుసగా ఆఫర్లను అందుకుంది. ఈ క్రమంలోనే 'రైడ్', 'కాస్కో', 'కళావర్ కింగ్', 'ప్రియుడు', 'జీనియస్' వంటి సినిమాలతో మెప్పించింది. అలాగే, తమిళం, హిందీ భాషల్లోనూ చాలా చిత్రాలు చేసింది. ఇలా సుదీర్ఘ కాలం పాటు శ్వేత బసు ప్రసాద్ హీరోయిన్‌గా ఫుల్ బిజీ అయింది.
వివాదాలతో కెరీర్ బ్రేక్‌లు:చాలా భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న సమయంలోనే శ్వేత బసు ప్రసాద్ ఓ కేసులో జైలుకు వెళ్లింది. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. దీంతో ఆమె కెరీర్‌కు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఈ వివాదం నుంచి తేరుకున్న శ్వేత.. ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్‌ను వివాహం చేసుకుంది. కానీ, ఏడాదిలోపే వీళ్లిద్దరూ విడాకులు తీసుకుని హాట్ టాపిక్ అయింది.

మళ్లీ ఆఫర్లతో సందడిగా:వివాదాల కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చేసిన శ్వేత బసు ప్రసాద్.. సెకెండ్స్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ముఖ్యంగా వెబ్ ఫిల్మ్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ సత్తా చాటుతోంది. అంతేకాదు, తెలుగులోనూ సినిమాలు చేసేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే ఓ మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ఫ్యాన్స్‌ను అలరించేలానే:ఎంతో గ్యాప్ తర్వాత వరుసగా ఆఫర్లను అందుకుంటోన్న శ్వేత బసు ప్రసాద్.. సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా హల్చల్ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ నిత్యం తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా క్రేజ్‌ను పెంచుకోవడంతో పాటు ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

గ్లామర్ షోతో కవిస్తోందిగా:సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న శ్వేత బసు ప్రసాద్.. ఈ మధ్యన మాత్రం తరచూ అందాలను ఆరబోస్తూ రచ్చ లేపుతోంది. ఇందులో భాగంగానే తన గ్లామర్‌ను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను పంచుకుంటోంది. ఇలా తన గ్లామర్‌తో శ్వేత బసు ప్రసాద్ ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది. అదే సమయంలో తరచూ సెన్సేషన్ అయిపోతోంది.
శ్వేత హాట్ సెల్ఫీ వైరల్:బబ్లీ హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ బోల్డు సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె డీప్ నెక్ టాప్‌లో దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫొటోలో ఆమె అందాలు మొత్తం చూపరులను ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా శ్వేత బసు ప్రసాద్ షేర్ చేసిన ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











