హద్దు దాటిన శ్వేతా బసు ప్రసాద్.. శృతి మించిన హాట్ షోతో అరాచకం

టాలీవుడ్‌లో అతి తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే మొదటి చిత్రంతోనే బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకోవడంతో పాటు సెన్సేషన్‌గా మారిపోయారు. అలాంటి వారిలో బబ్లీ బ్యూటీ శ్వేత బసు ప్రసాద్ ఒకరు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ చిన్నది.. ఎనలేని క్రేజ్‌ను దక్కిచుకుంది. అయితే, మధ్యలో వివాదాల కారణంగా కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకుంది. ఇప్పుడు మాత్రం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇక, సోషల్ మీడియాలో యమ సందడి చేస్తోన్న శ్వేత బసు ప్రసాద్.. తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

అలా వచ్చి.. ఫుల్ పాపులర్
సినిమాల కంటే ముందే శ్వేత బసు ప్రసాద్ మోడల్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. అలా చాలా కాలం పాటు సందడి చేసిన ఈ భామ.. 'మక్డీ' అనే మూవీతో నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత 'ఇక్బాల్' మూవీతో హీరోయిన్‌గా మారి చాలా చిత్రాల్లో నటించింది. అనంతరం 'కొత్త బంగారు లోకం' చిత్రంతో తెలుగులోకి ఎంటరైంది. ఈ చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ అయింది.

Kotha Bangaru Lokam Heroine Shweta Basu Prasad Latest Stunning Photos Viral

ఆ చిత్రాలు.. ఫుల్లు బిజీగా
తెలుగులో సెన్సేషనల్ స్టార్ట్ అందుకున్న శ్వేత బసు ప్రసాద్.. ఆ తర్వాత వరుసగా ఆఫర్లను అందుకుంది. ఈ క్రమంలోనే 'రైడ్', 'కాస్కో', 'కళావర్ కింగ్', 'ప్రియుడు', 'జీనియస్' వంటి సినిమాలతో అలరించింది. అలాగే, తమిళం, హిందీ భాషల్లోనూ చాలా చిత్రాలు చేసింది. ఇలా సుదీర్ఘ కాలం పాటు శ్వేత బసు ప్రసాద్ హీరోయిన్‌గా ఫుల్ బిజీగా గడిపింది.

కాంట్రవర్శీల సెన్సేషన్
చేతి నిండా సినిమాలు చేస్తూ ఫామ్‌లో దూసుకుపోతోన్న సమయంలోనే శ్వేత బసు ప్రసాద్ ఓ కేసులో జైలుకు వెళ్లింది. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. దీంతో ఆమె కెరీర్‌కు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఈ వివాదం నుంచి తేరుకున్న శ్వేత.. ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్‌ను వివాహం చేసుకుంది. కానీ, ఏడాదిలోపే వీళ్లిద్దరూ విడాకులు తీసుకుని మరోసారి వార్తల్లో నిలిచింది.

ఇప్పుడు వరుస చిత్రాలు
వరుసగా వివాదాలు తలెత్తడంతో కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకుని ఇబ్బంది పడిన శ్వేత బసు ప్రసాద్.. సెకెండ్స్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ముఖ్యంగా వెబ్ ఫిల్మ్స్‌, సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ సత్తా చాటుతోంది. అంతేకాదు, తెలుగులోనూ సినిమాలు చేసేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే ఓ మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

అలా ఫ్యాన్స్‌తో ముచ్చట
గతంలో కంటే ఇప్పుడు వరుసగా ఆఫర్లను అందుకుంటోన్న శ్వేత బసు ప్రసాద్.. సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా హల్చల్ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ నిత్యం తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా క్రేజ్‌ను పెంచుకోవడంతో పాటు ఫ్యాన్స్‌తో ముచ్చట్లు పెడుతోంది.

Kotha Bangaru Lokam Heroine Shweta Basu Prasad Latest Stunning Photos Viral

అందాలను ఆరబోస్తూనే
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న శ్వేత బసు ప్రసాద్.. ఈ మధ్యన మాత్రం తరచూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను పంచుకుంటోంది. ఇలా తన గ్లామర్‌తో శ్వేత బసు ప్రసాద్ ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది. అదే సమయంలో తరచూ ట్రెండింగ్‌లో ఉంటోంది.

శ్వేత బోల్డు పిక్స్ వైరల్
గ్లామరస్ హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డీప్ నెక్ టాప్, స్కిన్ టైట్ ప్యాంటులో దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫొటోల్లో ఆమె అందాలు మొత్తం చూపరులను యమా రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా శ్వేత బసు ప్రసాద్ షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X