బేబమ్మ కోసం ‘ఉప్పెన’లా.. ఖమ్మంలో కృతిశెట్టి రచ్చ
ఉప్పెన సినిమా ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఉప్పెన సినిమా విడుదల కాకముందే కృతి శెట్టి ఎంతో ఫేమస్ అయింది. ఆమె లుక్స్, గ్లామర్, ఎక్స్‌ప్రెషన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. అలా ఉప్పెన సినిమా విడుదలయ్యాయ అందరూ కూడా బేబమ్మ మాయలో పడిపోయారు. బేబమ్మ కంటిచూపుకే అందరూ పడిపోయారు. అలా కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్ జోడికి మంచి ఫాలోయింగ్ వచ్చింది.
చీరకట్టులో హంస నందిని సోయగాలు... స్లీవ్ లెస్ జాకెట్‌తో మరింత అందంగా
ఉప్పెన జంటకు సోషల్ మీడియాలో బాగానే క్రేజ్ వచ్చింది. అలా ఉప్పెన విడుదల కాకముందే సినిమా ఆఫర్లు వచ్చేశాయి. కృతి శెట్టి అయితే ఏకంగా వరుస ప్రాజెక్ట్‌లతో అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం జనాల్లో కృతి శెట్టికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.కరోనాను కూడా లెక్కచేయకుండా కృతి శెట్టిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. తాజాగా కృతి శెట్టి ఖమ్మంలో సందడి చేసింది.

ఖమ్మంలో కేఎల్‌ఎమ్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ప్రారంభోత్సవంలో ఉప్పెన జంట దుమ్ములేపేసింది. ఇక కృతిని చూసేందుకు ఖమ్మం వాసులు కుప్పలు తెప్పులు వచ్చారు. ఉప్పెనలా దూసుకొచ్చిన అభిమానులతో కృతి శెట్టి ఓ క్యూట్ సెల్ఫీని తీసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కృతి శెట్టి ప్రస్తుతం నాని, సుధీర్ బాబు వంటి హీరోల పక్కన హీరోయిన్‌గా చేస్తోన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











