అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా.. ఇపుడు అదే హీరోతో కృతి శెట్టి రొమాన్స్!

ఈ మధ్య కాలంలో కొందరు అతి మేధావులు సినిమాల విషయంలో చేస్తున్న పలు విమర్శల్లో హీరో మరియు హీరోయిన్ నడుమ వయస్సు వ్యత్యాసం కూడా ఒకటి అని చెప్పాలి. ఎప్పుడు నుంచో చాలా మంది సీనియర్ హీరోలు హీరోయిన్స్ నడుమ ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్న సినిమాలే వచ్చి హిట్స్ అయ్యినవి కూడా ఉన్నాయి కానీ ఇపుడు ట్రెండ్, తరాలు మారడంతో ప్రెజెంట్ జెనరేషన్ వీటిని భూతద్దంలో చూస్తూ ఆయా స్టార్స్ ని కించపరిచే రకంగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

కాగా మన తెలుగులో ఈ ధాటి ఇంకా ఎక్కువ కనిపిస్తుంది కానీ లేటెస్ట్ గా అయితే కోలీవుడ్ ఆడియెన్స్ లో ఓ టాక్ వైరల్ గా మారింది. ఓ స్టార్ హీరో ఒక యువ హీరోయిన్ తో నటించడం చర్చకి దారి తీసింది. ఇక్కడ క్రేజీ ట్విస్ట్ ఏమిటంటే ఇదే హీరోతో ఆ హీరోయిన్ కొన్నేళ్ల కితం చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది. మరి ఆ హీరో అండ్ హీరోయిన్స్ ఎవరో కాదు మన తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా పరిచయం ఉన్న నటుడు కార్తీ కాగా హీరోయిన్ కృతి శెట్టి అట.

krithi shetty as child artist and now heroine for this star hero

అవును కార్తీ నటించిన ఓ సినిమాలో కృతి చాలా చిన్న అమ్మాయిగా కనిపించింది అని సోషల్ మీడియాలో టాక్ వైరల్ గా మారింది. కాగా కార్తీ ఎప్పుడు నుంచో సినిమాలు చేస్తున్నాడు. తన వయస్సు 46 పైనే.. అయినప్పటికీ తాను చాలా యంగ్ గా కనిపిస్తాడు. ఇక కృతి శెట్టి వయస్సు కేవలం 21 మాత్రమే.. కాగా ఈ ఇద్దరు ఇపుడు హీరో హీరోయిన్స్ గా "వా వాథియర్" అనే సినిమాలో నటిస్తున్నారు.

అయితే ఈ ఇద్దరి నడుమ ఏకంగా 15 ఏళ్ళు గ్యాప్ ఉంది. అయితే ఇలాంటి గ్యాప్ లు సహజమే అనుకోవచ్చు కానీ కృతి శెట్టి గత దశాబ్దం కితమే కార్తీ సినిమాలో కనిపించింది అని తమిళ సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు వైరల్ గా మారాయి. కార్తీ నటించిన రస్టిక్ థ్రిల్లర్ సినిమా "నా పేరు శివ" చాలా మందికి తెలిసే ఉంటుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలోనే కృతి శెట్టికి కార్తీకి చిన్న సీన్ ఉంటుంది.

అయితే అపుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఆమెతోనే కార్తీ ఇపుడు హీరోగా ఎలా నటిస్తున్నాడు అంటూ పలు విమర్శలు కూడా చాలా మంది చేస్తున్నారు. అయితే ఇంకొంతమంది ఇందులో నిజమెంత అని ఆరాలు తీస్తున్నారు కానీ ఇది నిజమే అని కోలీవుడ్ ఆడియెన్స్ చెబుతున్నారు. మరి అప్పట్లో బుల్లి నటిగా కనిపించిన కృతి శెట్టి ఇపుడు అదే కార్తీ సరసన హీరోయిన్ గా అంటే చాలా మందికి మింగుడు పడడం లేదు.

కానీ సినిమాలో మాత్రం ఇవన్నీ కామన్ గానే కనిపిస్తూ ఉంటాయి. గతంలో కూడా శ్రీదేవి, సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో హీరోయిన్ గానూ, చైల్డ్ ఆర్టిస్ట్ గానూ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇపుడు ట్రెండ్ మారడంతో హీరోస్ మీదనే విమర్శలు తప్పడం లేదు. కానీ అన్నీ తెలిసే కదా హీరోయిన్స్ కూడా ఒప్పుకుంటున్నారు అనే మాటలు అటు దర్శకులు నుంచి సహా అభిమానులు నుంచి వస్తున్నాయి. మొత్తానికి కార్తీ అండ్ కృతి శెట్టి విషయంలో మాత్రం ఈ టాక్ సోషల్ మీడియాలో రచ్చగా నడుస్తుంది.

More from Filmibeat

Read more about: krithi shetty uppena karthi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X