ఉప్పెన 'బేబమ్మ' టీనేజ్ ఫొటోస్ వైరల్.. 'కిస్ మీ' అంటూ ఆ వయసులోనే షాక్ ఇచ్చింది!
సినిమా ఇండస్ట్రీలో కష్టంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి అంటారు. కెరీర్ యూ టర్న్ తీసుకోవడానికి ఎవరికైనా సరే ఒక్క సినిమా చాలు. హిట్టు పడింది అంటే ఆపడం ఎవరి తరం కాదు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కృతి శెట్టికి డిమాండ్ గట్టిగానే పెరిగింది. అమాయకంగా కనిపిస్తూ కళ్ళతోనే కుర్రాళ్ళ గుండెలను పిండేస్తోంది. ఉప్పెన హిట్టుతో అమ్మడి రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇక ఈ బ్యూటీ గతంలో కొన్ని యాడ్స్ లలో కూడా నటించింది. చిన్నప్పటి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.

70కోట్లకు పైగా వసూళ్లు
వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన మొదటి సినిమా ఉప్పెన ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ ప్రేమ కథ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 70కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో టాప్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి బూస్ట్ ఇచ్చింది.

ఉప్పెనకు మొదట కృతిని అనుకోలేదట
ఇక సినిమాలో అందరి కంటే ఎక్కువ క్రేజ్ అందుకుంది మాత్రం కీర్తి శెట్టినే. నిజానికి ఉప్పెన సినిమాలో మొదట బేబమ్మ పాత్రకు ఈ బ్యూటీని అనుకోలేదు. మనిషా అనే తెలుగమ్మాయిని అనుకున్నారు. సినిమాను లాంచ్ కూడా ఆ బ్యూటీతోనే మొదలు పెట్టారు. అయితే సడన్ గా కృతి శెట్టి ఎదురవ్వడంతో కథకు ఇంకా బాగా సెట్టవుతుందని దర్శకుడు బుచ్చిబాబు ఆమెను మార్చక తప్పలేదు.

ఆమె వయసు.. అంతేనా?
ఒక విధంగా సినిమాకు కృతి శెట్టి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. రొమాంటిక్ సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో విజయ్ సేతుపతితో ఆమె నటించిన విధానం అందరిని ఎట్రాక్ట్ చేసింది. ఇక ప్రస్తుతం ఆమె గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక ఆమె వయసు ప్రస్తుతం 17ఏళ్ళు. ఇంత చిన్న వయసా అంటూ కొందరు నోరెళ్లబెడుతున్నారు.

పలు యాడ్స్ లలో..
కృతిశెట్టికి నటన అనేది కొత్తేమి కాదు. హీరోయిన్ గా ఆమె మొదటి సినిమా అయినప్పటికీ ఇంతకుముందు ఆమె ఎన్నో కమర్షియల్ యాడ్స్ లలో నటించింది. లైఫ్ బాయ్, పెన్సిల్, పెన్ను వంటి కంపెనీలకు యాడ్స్ చేసింది. ఆ యాడ్స్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

'కిస్ మీ' యాడ్ లో కూడా
ముఖ్యంగా టీనేజ్ వయసులో ఆమె డైరీ మిల్క్ యాడ్ చేసింది. 'కిస్ మీ' అనే ఆ యాడ్ లో నటించింది కృతి శెట్టి అని చాలా రోజులకు తెలియడంతో ఆ వీడియో కూడా బాగానే వైరల్ అవుతోంది. ఇక ఆమె చిన్నప్పుడు దిగిన ఫొటోలు కూడా బాగానే ట్రెండ్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఆ సినిమాలతో బిజీగా..
ఉప్పెన అనంతరం కృతిశెట్టికి ఆఫర్స్ చాలానే వస్తున్నాయి. అయితే ఆమె మాత్రం చాలా నెమ్మదిగా తనకు సెట్టయ్యే. కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటోంది. ప్రస్తుతం నానితో శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సుధీర్ బాబు - మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో కూడా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











