Krithi Shetty మాచర్ల నియోజకవర్గం మాస్ అండ్ క్లాస్.. నితిన్ ఫెర్పార్మెన్స్ మరో రేంజ్‌లో!
శ్రేష్ట్ మూవీస్ బ్యానర్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (ఇండియా) ఎల్ఎల్‌పీ బ్యానర్లపై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. నితిన్, కృతిశెట్టి, క్యాథరీన్ త్రెసా హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కృతిశెట్టి మాట్లాడుతూ... మాచర్ల నియోజకవర్గం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చి మమల్ని ఆశీర్వదించిన డైరెక్టర్లందరికీ నా బిగ్ థ్యాంక్స్ అని అన్నారు. ఇంకా కృతిశెట్టి మాట్లాడుతూ..

నితిన్ మంచి స్నేహితుడిగా
మాచర్ల నియోజకవర్గం నియోజకవర్గం కలెక్టర్‌గా నటించాను. ఈ సినిమాలో పార్ట్‌నర్ ఇన్ క్రైమ్ కాదు.. పార్ట్‌నర్ ఇన్ జస్టిస్ అని అంటాను. మాచర్ల నియోజకవర్గంలో నితిన్‌తో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉన్నాను. ఆయన నాకు ఓ స్నేహితుడు అయిపోయారు. మాచర్ల నియోజకవర్గం సినిమా మాస్ అండ్ క్లాస్ మిక్చర్. మాసీ, క్లాసీ అవతారంలో నితిన్ కనబడుతారు. మరో లెవెల్‌లో నితిన్ కనిపిస్తారు అని కృతి శెట్టి అన్నారు.

ఫస్ట్ రోజు నుంచి అదే కాన్ఫిడెన్స్
మాచర్ల నియోజకవర్గం సినిమాలో గ్రామీణ నేపథ్యం ఉన్న స్వాతి క్యారెక్టర్‌ను ఇచ్చినందుకు దర్శకుడు రాజశేఖర్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ రోజు నుంచి నాపై ఉన్న కాన్ఫిడెన్స్ చాలా హ్యాపీగా ఉంది. దర్శకుడిగా మీరు చూపిన అంకితభావాన్ని చూసి నేను థ్రిల్ అయ్యాను. మళ్లీ మీతో కలిసి నటించే అవకాశాన్ని నాకు ఇవ్వండి. అని కృతిశెట్టి పేర్కొన్నారు.

సముద్ర ఖని గొప్పగా
మాచర్ల నియోజకవర్గంలో సముద్రఖని గొప్పగా నటించారు. ఆయనతో కలిసి నటించినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాలో క్యాథరీన్ త్రెసాతో కలిసి నటించాను. ఆమె తన పాత్రను అద్భుతంగా పోషించింది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ లాంటి సీనియర్లతో కలిసి నటించాను. నాకు మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలు నిఖితారెడ్డి, సుధాకర్ రెడ్డి ధన్యవాదాలు అని కృతిశెట్టి తెలిపారు.

నా ఫేవరేట్ సాంగ్ అదిరిందే
మాచర్ల నియోజకవర్గం సినిమాకు టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ ప్రాణం పెట్టి చేశారు. ఈ సినిమాకు మహతి సాగర్ మ్యూజిక్ పెద్ద అస్సెట్. నా ఫేవరేట్ సాంగ్ అదిరిందే. సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరేళ్ల గురించి గొప్పగా చెప్పుకొంటారు. ఆయన ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. పనిపై ధ్యాస తప్ప మరోటి ఉండదు. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి చాలా థ్యాంక్స్.

టాలీవుడ్‌కు పూర్వవైభవం
ఆగస్టు నెలలో రిలీజైన సీతారామం, బింబిసార సినిమాలు పెద్ద విజయం సాధించాయి. అందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్లీ టాలీవుడ్‌కు పూర్వవైభవం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. టాలీవుడ్‌కు మరిన్ని సక్సెస్‌లు రావాలని కోరుకొంటున్నాను అని కృతిశెట్టి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











