మహేశ్ బాబుతో కృతి శెట్టి రొమాన్స్: అదిరిపోయే ప్లాన్ వేసిన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్

వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పరశురాంతో కలిసి 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఇది పట్టాలెక్క ముందే దర్శకధీరుడు రాజమౌళి కూడా ఆయనతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే, ఇది ప్రారంభం అవడానికి చాలా సమయం పట్టేలా ఉండడంతో మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' తర్వాత మరో సినిమాను చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం పలువురు దర్శకులతో కథా పరమైన చర్చలు కూడా జరిపాడు.

ఇందులో భాగంగానే గతంలో 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించిన అనిల్ రావిపూడి కూడా మహేశ్ బాబుకు ఓ కథను వినిపించాడు. యూనివర్శల్ కాన్సెప్ట్ అయిన స్పోర్ట్స్ డ్రామాతో కూడిన స్క్రిప్టు కావడంతో దీనికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ సినిమాలో మహేశ్ క్రీడాకారుడిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. 'సర్కారు వారి పాట' పూర్తైన వెంటనే ఇది పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇందులో హీరోయిన్‌గా 'ఉప్పెన' భామ కృతి శెట్టిని తీసుకున్నారని తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్: పవన్ కళ్యాణ్ నా దేవుడంటూ బండ్ల గణేష్ రచ్చ (ఫొటోలు)

Krithi Shetty Fix for Mahesh Babu and Anil Ravipudi Movie

మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ప్రశంసలు దక్కించుకుంది కృతి శెట్టి. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె నేచురల్ స్టార్ నానితో 'అంటే సుందరానికీ', సుదీర్ బాబుతో ఓ సినిమాతో పాటు రామ్ పోతినేని - లింగుసామీ కలయికలో రాబోతున్న ద్విభాషా చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు తమిళంలో సూర్యతోనూ ఓ సినిమాకు సంతకం చేసేసింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడం వల్లే మహేశ్ బాబు కోసం కృతిని ముందుగా బుక్ చేసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X