క్యూట్ గా చూస్తూ హీటెక్కిస్తున్న కృతిశెట్టి.. అలా అయితే కష్టమే అంటున్న ఫాన్స్!
చేసిన మొదటి సినిమాతో స్టార్ స్టేటస్ దక్కించుకుంది కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ అందాల ఆరబోత విషయంలో ఇప్పటి వరకు పెద్దగా ఆసక్తి చూపించలేదు కానీ తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ ఇప్పుడు అనేక చర్చలకు దారితీస్తోంది. ఆ ఫోటో షూట్ లో ఆమెమీ హద్దులు దాటలేదు కానీ దాటే లాగానే కనిపిస్తోంది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

తెలుగు సినిమాల్లో
ముంబైలో సెటిలయిన తుళు కుటుంబంలో కృతి శెట్టి జన్మించింది. ఆమె తండ్రి ఒక బిజినెస్ మాన్ కాగా తల్లి ఒక ఫ్యాషన్ డిజైనర్. చిన్ననాటి నుంచి సినిమాల మీద ఆమెకు ఆసక్తి ఉండేది కానీ మొదట ఆమెకు టీవీ యాడ్స్ లో నటించే అవకాశం దొరికింది. అలా ఆమె టీవీ యాడ్స్ లో నటిస్తూ 17 ఏళ్ల వయసులోనే హృతిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ థర్టీ అనే సినిమాలో ఒక స్టూడెంట్ పాత్రలో కనిపించింది ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో నటించేందుకు అనేక ప్రయత్నాలు చేసింది.

ఉప్పెన సినిమా
అనూహ్యంగా ఆమెకు ఉప్పెన సినిమా ఆఫర్ లభించింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించడమే కాక 100 కోట్ల కలెక్షన్లు సాధించింది. అలా ఓవర్ నైట్ సక్సెస్ అందుకున్న ఆమెకు తర్వాత నాని సినిమాలో అవకాశం దొరికింది. అల శ్యామ్ సింగరాయ్ సినిమాలో కనిపించిన ఆమె తర్వాత బంగారురాజు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి సినిమాలలో నటించింది.

చర్చనీయాంశంగా
ఇక ఆమె నటించిన ది వారియర్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం సినిమాలు షూటింగ్ దశలో ఉండగా నాగచైతన్య హీరోగా వెంకట ప్రభు తెరకెక్కిస్తున్న సినిమా ఈ మధ్యనే ప్రారంభోత్సవం జరుపుకుంది. అయితే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న కృతి శెట్టి ఇప్పుడు తాజాగా తన ఫోటోషూట్ షేర్ చేయడం ద్వారా టాలీవుడ్ లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

అర్థం కావడం లేదంటూ
ఆమె ఒక వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతూనే మరోపక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అవుతుంది. తాజాగా ఆమె ప్యూర్ ఎల్లో కలర్ లో ఉన్న డ్రెస్ తో ఫోటో షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో విడుదల చేసింది. చాలా తక్కువ సమయంలోనే ఆమె ఫోటోలకు అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఆమె క్యూట్ గా కనిపిస్తేనే హీటెక్కిస్తోందని ఇక హాట్ గా కనబడితే పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదంటూ ఆమె ఫోటోలు మీద అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

అతి తక్కువ కాలంలోనే
ఇక ఆమెకు తమిళంలో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. ధనుష్ హీరోగా అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో ఆమె హీరోయిన్గా ఎంపిక అయిందంటూ ప్రచారం జరుగుతోంది. మరోపక్క ఆమె సూర్య బాలా సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్గా ఆమె పేరు తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











