ఉప్పెన బ్యూటీ గ్లామర్ ట్రీట్.. అందానికి గ్రామర్ నేర్పుతున్న కృతిశెట్టి
హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వడం అనే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత కష్టమైన పనే కాదు అంటారు. కానీ, ఫస్ట్ మూవీతోనే సక్సెస్‌ను, క్రేజ్‌ను సొంతం చేసుకోవాలంటే మాత్రం అందరికీ సాధ్యం కాదు. అలాంటిది ఒకే ఒక్క చిత్రంతో సెన్సేషన్‌గా మారింది కృతి శెట్టి.
అంతేకాదు, ఆరంభంలోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.అలాంటిది ఇప్పుడు ఆఫర్లనే అందుకోలేకపోతోంది. అయితేనేం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కొన్ని క్యూట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

సూపర్ 30.. ఉప్పెన మూవీతో: టీనేజ్‌లోనే మోడల్‌గా కెరీర్ మొదలెట్టిన కృతి శెట్టి 2019లో వచ్చిన 'సూపర్ 30' అనే హిందీ చిత్రం ద్వారా యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాతి ఏడాదే 'ఉప్పెన' మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా వచ్చింది. ఇందులో అదిరిపోయే నటన, అందంతో విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌గా మారిపోయింది.

వరుస హిట్లు.. లక్కీ బ్యూటీగా: 'ఉప్పెన' తర్వాత కృతి శెట్టికి తెలుగులో అవకాశాలు ఫుల్‌గా వచ్చాయి. అందుకు అనుగుణంగానే ఆమె వచ్చిన ప్రతి సినిమానూ చేసేసింది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు వరుసగా 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' వంటి చిత్రాల్లో నటించింది. ఇవి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో కృతి శెట్టి టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్ అనే పేరును కూడా దక్కించుకుని సత్తా చాటింది.

నాలుగు ఫ్లాపులు.. పెద్ద షాక్: కెరీర్ తొలినాళ్లలో చేసిన సినిమాలన్నీ సక్సెస్ అవడంతో కృతి శెట్టి వెనుదిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే, ఆ తర్వాత ఆమె చేసిన 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' వంటి సినిమాల్లో నటించింది. వీటికి తోడు ఇటీవలే విడుదలైన 'కస్టడీ' మూవీ కూడా డిజాస్టర్‌గానే మిగిలిపోయింది.
ఆ భాషల్లోనే మూవీలు చేస్తూ: వరుసగా నాలుగు డిజాస్టర్లను మూటగట్టుకున్న కృతి శెట్టి.. ఇప్పుడు ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా చేయడం లేదు. కానీ, వేరే భాషల్లో మాత్రం కొన్ని ఆఫర్లను అందుకుని ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలా ప్రస్తుతం కృతి శెట్టి మలయాళంలో Ajayante Randam Moshanam అనే మూవీలో నటిస్తోంది. అలాగే, తమిళంలో 'జీనీ' అనే సినిమాను కూడా చేస్తోంది.

అందులో మాత్రం ఫుల్ బిజీ: టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా వచ్చినప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న కృతి.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలను, వీడియోలను సైతం షేర్ చేస్తూ ముందుకెళ్తోంది.

ఇందులో మాత్రం చూపిస్తూ: యంగ్ లేడీ కృతి శెట్టి సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోంది. అయితే, చాలా మంది హీరోయిన్లులా ఈ అమ్మడు ఆరంభంలో హాట్ షో మాత్రం పెద్దగా చేయలేదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఆమె లేలేత అందాలను చూపిస్తూ కవ్విస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూనే ఉంది.

షార్ట్ డ్రెస్‌లో కృతి శెట్టి పిక్స్: క్యూట్ లేడీ కృతి శెట్టి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె అతి చిన్న డ్రెస్ మాత్రమే వేసుకుని హాట్ షో చేస్తూ ఫొటోలను దిగింది. ఈ పిక్స్‌లో ఆమె అందాలు హైలైట్ అవుతున్నాయి. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ విపరీతంగా వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











