Bangarraju: నాగలక్ష్మిగా రాబోతున్న కృతి శెట్టి.. హిట్టు కల కనిపిస్తోంది

ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఒక్కసారిగా తన స్టార్ హోదాను పెంచేసుకుంది. పదేళ్ల వయసు నుంచే యాడ్స్ ల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కృతి శెట్టి ఆ తరువాత పదహారేళ్ళ వరకు కూడా యాడ్స్ తోనే చాలా బిజీగా కనిపించింది. ఇక ఆమె మోడలింగ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తుందని అనుకున్న సమయానికి ఒక్కసారిగా సినిమా ఆఫర్లు వచ్చి పడ్డాయి. అయితే ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా ఈ బ్యూటీ ఏ మాత్రం తొందరపడలేదు. ఇక ఉప్పెన సినిమా కథ గురించి వినగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అసలైతే ఉప్పెన సినిమా కోసం మరొక హీరోయిన్ ను అనుకున్నారు. కానీ సినిమా స్టార్ట్ అయ్యే ముందు కృతి శెట్టి దొరకడంతో ఆమెను ఫైనల్ చేసేశారు.

అదృష్టవశాత్తూ కృతిశెట్టి బాక్సాఫీస్ వద్ద మొదటి అడుగులోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఆ సినిమా ప్రభావంతో అమ్మడికి టాలీవుడ్ నుంచి అలాగే కోలీవుడ్ నుంచి కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా బాక్సాఫీస్ వద్ద మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న జంటగా కూడా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి రికార్డుల్లోకి ఎక్కారు. ఇక ఆ సినిమా అనంతరం వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలను లైన్ లో పెట్టిన బేబమ్మ బంగార్రాజు సినిమాలో కూడా ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతోంది. ఆ సినిమాకు సంబంధించిన స్పేషల్ పోస్టర్ ను నేడు విడుదల చేశారు. అందులో ఆమె నాగలక్ష్మి అనే పాత్రలో కనిపించబోతోంది. మెడలో దండ వేసుకొని పక్కా పల్లెటూరి అమ్మాయి తరహాలో కనిపిస్తున్న కృతి శెట్టి ఈసారి కూడా మరో బాక్సాఫీస్ హిట్ కొట్టేలా ఉన్నట్లు అర్ధమవుతోంది.

Krithi Shetty nagalalshmi character first look from bangarraju

సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న బంగార్రాజు సినిమాలో నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి కూడా ముఖ్యమైన పాత్రలోనే కనిపించబోతున్నట్లు సమాచారం. ఈసారి మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్ ను కూడా గట్టిగానే టచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ కృష్ణ కురసాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇక అనూప్ రూబేన్స్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాను సంక్రాంతి సీజన్ లో విడుదల చేసి సక్సెస్ అందుకున్న నాగార్జున ఈసారి కూడా అదే తరహాలో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కానీ ఈసారి పోటీ తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంది. RRR, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సినిమాలు డామినేషన్ గట్టిగానే ఉంటుంది. కాబట్టి ఏ సినిమా వచ్చినా ప్రమాదమే. మరి ఈ బంగార్రాజు సంక్రాంతికి వస్తే ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. ఒకవేళ అప్పుడు కుదరకపోతే సమ్మర్ కు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X