ఆ రోజే సినిమాలు ఆపేద్దాం అనుకున్న.. ఉప్పెన బ్యూటీ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఉప్పెనతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తక్కువ కాలంలోనే తనదైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో మంచి విజయాలు అందుకుంది. ఆ తర్వత చేసిన ప్రాజెక్టులు మాత్రం ఆశించిన ఫలితాలు అందించలేదు. వరుసగా అపజయాలతో టాలీవుడ్‌లో ఆమెకు ఆఫర్లు తగ్గిపోయాయి. దీంతో కృతి ప్రస్తుతం తమిళ పరిశ్రమకు మళ్లి వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక దశలో సినిమాల్లో అపేద్దామనే ఆలోచన వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే ..?

ఉప్పెన తెలుగు ఇండస్ట్రీలో ఓ సంచలనం. కొత్త దర్శకుడు, కొత్త హీరో,హీరోయిన్ కాంబోతో తెరకెక్కిన ఈ మూవీ..ఊహించని విధంగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా రూపొందించిన ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కానీ, ఈ సినిమాలో మొదట తీసుకున్న హీరోయిన్ మారిపోవడం, చివరికి కృతిని ఎంపిక చేయడం అప్పట్లో పెద్ద చర్చకెక్కింది.

Krithi Shetty Nearly Quit Films After Uppena Stress Hair Loss Life-Changing Audience Love

తాజాగా కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్బంగా తన తొలి సినిమా ఉప్పెన షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాలు గురించి భావోద్వేగానికి గురైంది. ఉప్పెన షూటింగ్‌కు ముందు సినిమాల గురించి ఒక రకంగా ఊహించి వచ్చానని, కానీ ఆచరణలో ఎదురైన కష్టాలు తన అంచనాలకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని తెలిపింది. 'ఆ పాత్ర చాలా డిమాండ్ చేసింది. కానీ నేను ఆ స్థాయికి మెంటల్‌గా, ఫిజికల్‌గా రెడీగా రాలేదు' అంటూ చెప్పుకొచ్చింది.

షూటింగ్ సమయంలో విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొన్నానని, దాని ప్రభావం తన శరీరంపై పడిందని హీరోయిన్ కృతి వెల్లడించింది. స్ట్రెస్ కారణంగా వెంట్రుకలు రాలిపోవడం, చర్మ సమస్యలు రావడం వల్ల చాలా మానసిక వేదనకు గురయ్యానని చెప్పింది. ఆ సమయంలో తనకు, తన అమ్మానాన్నలకూ సినిమా ప్రపంచం కొత్త అనీ, ఇంత కష్టం ఉంటుందని తాము ఊహించలేదనీ తెలిపింది. అమ్మానాన్నలు కూడా 'ఈ ఒక్క సినిమా చేసి వదిలేద్దాం' అన్నారంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

తాను కూడా ఇదే తన చివరి సినిమా కావొచ్చని ఒక దశలో అనుకున్నానని చెప్పింది. కానీ, సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన ప్రేక్షకుల ప్రేమ తన నిర్ణయాన్ని మార్చేసిందని, ఆ ప్రేమకే తాను నటిగా కొనసాగుతున్నానని పేర్కొంది. ఉప్పెన సక్సెస్ తరువాత వరుస ఆఫర్లు వచ్చినా, తరువాత నటించిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద విఫలం కావడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ తీవ్రమయ్యాయని కృతి ఆవేదన వ్యక్తం చేసింది. మన నియంత్రణలోని విషయాలపై విమర్శలు రావడం బాధాకరమనీ, కొన్ని సార్లు కావాలనే ఇబ్బందులకు గురిచేస్తారు. చిన్న వయస్సులో వాటిని తట్టుకోవడం చాలా కష్టమని ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం తమిళంలో వరుస అవకాశాలు పొందుతున్న కృతి శెట్టి.. ఇలా తన ప్రయాణాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఈ నెల 12న కార్తితో కలిసి 'అన్నగారు వస్తారు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. తన సినిమా ప్రయాణంలో ఇంకా బెస్ట్ అవకాశం రాలేదనీ, తనని తాను నిరూపించుకోవాలని కృతి శెట్టి భావిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు కామెంట్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

More from Filmibeat

Read more about: vaishnav tej krithi shetty uppena
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X