నా బ్రేకప్ మా అమ్మకు కూడా తెలుసు.. పర్సనల్ లైఫ్‌పై నోరు విప్పిన కృతిశెట్టి

యంగ్ హీరోయిన్ కృతిశెట్టి (Krithi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ హీరో వైష్ణవ్‌ తేజ్‌ , స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కిన సినిమా ఉప్పెన మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. 'బేబమ్మ'గా కృతి నటన అందం అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో తొలి సినిమాతోనే స్టార్ స్టేటస్ అందుకుంది. యువ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఈ అందాల భామ తాజా వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి సినిమా వల్ల కాదు.. వ్యక్తిగత జీవిత విషయాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తొలిసారి తన ప్రేమ, బ్రేకప్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. ఇంతకీ ఏమన్నారంటే?

ఉప్పెన సినిమాతో భారీ విజయం సాధించడంతో కృతి శెట్టికి వరుస అవకాశాలు వచ్చాయి. అలా బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్, మాచెర్ల నియోజకవర్గం, ది వారియర్, మనమే, ఆర్మ్, వా వాతియార్ సినిమాల్లో నటించే అవకాశం అందుకున్నారు. ఇలా వరుస విజయాలు సాధించి టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. ఆ జోరు ఎక్కువకాలం కొనసాగలేదు. తర్వాత చేసిన పలు సినిమాలు ఆశించిన విజయాలు అందుకోకపోవడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆమె తమిళం, మలయాళ భాషల్లో పలు ప్రాజెక్టులు చేస్తోంది. ఇటీవల కాలంలో ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమె గ్రాఫ్ కాస్త తడబాటుకు గురైంది.

Krithi Shetty Opens Up About Her Breakup Even My Mother Knows About It

ఇదిలా ఉంటే.. ఈ నేపథ్యంలో కృతి శెట్టి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వైరల్ మారింది. ఇందులో ఈ అమ్మడు మాట్లాడుతూ.. తన తొలిసారి తన ప్రేమ, బ్రేకప్ గురించి ఓపెన్‌గా చెప్పేసింది. కృతిని వ్యక్తిగత జీవితం గురించి యాంకర్ ప్రశ్నించగా, ఎలాంటి సంకోచం లేకుండా సమాధానం ఇచ్చింది. మీ లైఫ్ లో ఎన్ని బ్రేకప్స్ ఉన్నాయని ప్రశ్నించగా, తన జీవితంలో ఒకసారి ప్రేమ విఫలమైందని, ప్రస్తుతం మాత్రం పూర్తిగా సింగిల్‌గా ఉన్నానని తెలిపింది. అంతేకాదు, ఆ విషయం తన తల్లికి కూడా తెలుసని చెప్పడం విశేషం.

సాధారణంగా వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచే సినీ సెలబ్రిటీలు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ప్రేమ,బ్రేకప్ వంటి విషయాలను గోప్యంగా ఉంచుతారు. కానీ కృతి శెట్టి ఎలాంటి సంకోచం లేకుండా తన జీవితంలో బ్రేకప్ జరిగిన విషయాన్ని అంగీకరించడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ఇక ప్రేమ గురించి మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్‌పైనా కృతి స్పందించింది. తనపై ఉద్దేశపూర్వకంగా నెగెటివ్ కామెంట్స్ చేసే వారిని సహించనని, అలాంటి అకౌంట్లను వెంటనే బ్లాక్ చేస్తానని స్పష్టం చేసింది. సోషల్ మీడియాను పాజిటివ్‌గా ఉపయోగించాలని భావిస్తానని, ద్వేషపూరిత వ్యాఖ్యలకు తన జీవితంలో స్థానం లేదని చెప్పింది.

Read more about: krithi shetty uppena buchi babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X