కృతిశెట్టి గదిలో దెయ్యం.. లైట్ వేయబోతుుండగా అలా..

మనలో చాలామందికి ఆత్మలు, దెయ్యాలు వంటి వాటిపై నమ్మకం ఉంది. నిజ జీవితంలో వింత అనుభవాలు ఎదురైన వారు కూడా మన చుట్టూ ఉన్నారు. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా దీనికి అతీతం కాదు. ఎందరో ప్రముఖులు తమ జీవితంలో ఎదురైన సంఘటనల్ని బయటపెట్టారు. కొందరి అనుభవాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరారు యంగ్ బ్యూటీ కృతిశెట్టి. ఓ సినిమా షూటింగ్ సమయంలో చోటు చేసుకున్న భయానక అనుభవాన్ని బయటపెట్టారు ఈ కన్నడ బ్యూటీ. ఈ వివరాల్లోకి వెళితే..

ఉప్పెనతో ఓవర్‌నైట్ స్టార్‌గా
ఒకే ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన వారు చిత్ర పరిశ్రమలో అరుదుగా కనిపిస్తారు. ఏళ్లుగా కష్టపడుతున్న వారికి ఏ మాత్రం పేరు రాకపోగా.. కొందరు మాత్రం అవకాశాలను ఎగరేసుకుని పోతారు. ఈ లిస్ట్‌లోకి వస్తారు కృతి శెట్టి. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన చిత్రం ద్వారా తెలుగువారిని పలకరించారు కృతి. ఈ సినిమాలోని బేబమ్మ పాత్రతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేశారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఈ ముద్దుగుమ్మకు ఉప్పెన్ సినిమాలో నటించేసరికి ఆమె వయసు కేవలం 17 ఏళ్లే.

Krithi Shetty says she saw the spirit during Vaa Vaathiyaar shooting

టాలీవుడ్‌కు దూరంగా కృతిశెట్టి
ఉప్పెన బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగులో కృతిశెట్టికి అవకాశాలు క్యూకట్టాయి. కానీ సక్సెస్‌ను మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడి, మనమే తదితర సినిమాలలో నటించింది కృతిశెట్టి. ఈ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఆమె టాలీవుడ్‌కు దూరమయ్యారు. తమిళం, మలయాళ పరిశ్రమలపై కృతిశెట్టి ఫోకస్ పెట్టారు. మలయాళంలో ఏఆర్ఎం సినిమాలో నటించగా.. తమిళంలో ప్రస్తుతం వా వాతియర్, లవ్ ఇన్సూరన్స్ కంపెనీ, జినీ సినిమాలలో కృతి నటిస్తున్నారు.

డిసెంబర్ 12న అన్నగారు వస్తారు
వీటిలో వా వాతియర్‌ తెలుగులో అన్నగారు వస్తారు పేరుతో రిలీజ్ అవుతోంది. కార్తీ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యరాజ్, రాజ్ కిరణ్, నిలగళ్ రవి, ఆనంద్ రాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్‌లు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజైన అన్నగారు వస్తారు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా కృతిశెట్టి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

నా రూమ్‌లో ఆత్మ కనిపించింది
అన్నగారు వస్తారు సెట్స్ మీదకి వెళ్లడానికి ఒక రోజు ముందు వింత అనుభవం ఎదురైంది. ఆ రోజు రాత్రి మా అమ్మతో కలిసి హోటల్ రూమ్‌లో ఉండగా నాకు ఆత్మ లాంటి ఆకారం కనిపించింది. మేం భయంతో లైట్ వేయగానే పెద్ద శబ్ధం వినిపించి ఆత్మ మాయమైంది. అది ఎందుకు వచ్చిందో తెలియలేదు.. కానీ మేం తుళు జాతికి చెందినవాళ్లం కాబట్టి ఇలాంటి వాటిపై ముందు నుంచి నమ్మకం ఉంది. మా పూర్వీకులను దైవంలా పూజిస్తాం. మా పెద్దలు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంటారని తుళు ప్రజలు నమ్ముతారు. ఈ ఘటనతో మా విశ్వాసం మరింత పెరిగింది అని కృతిశెట్టి తెలిపారు.

ప్రమోషన్ కోసమా? నిజమా?
ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. కార్తీతో నటించిన అన్నగారు వస్తారు సినిమాలో కృతిశెట్టి పాత్ర ఆత్మలతో మాట్లాడుతుంది. దాంతో ఆమె ఈ వ్యాఖ్యలను సినిమా ప్రమోషన్ కోసం చేసిందా? లేక నిజంగానే ఆత్మ కనిపించిందా? అనేది మాత్రం త్వరలోనే క్లారిటీ రానుంది.

More from Filmibeat

Read more about: krithi shetty spirit karthi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X