Krithi Shetty ఫస్ట్ లుక్‌‌తో బేబమ్మ అదుర్స్..మాచర్ల నియోజకవర్గంలో గ్లామర్ ట్రీట్

ఉప్పెన చిత్రంలో బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్న కృతిశెట్టి వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నది. ప్రస్తుతం ఏడాదిలో శ్యామ్ సింగరాయ్, తాజాగా ది వారియర్ చిత్రాల్లో తమ గ్లామర్ పంట పండించింది. ఇక మరోసారి స్టైలిష్ లుక్‌తో మాచర్ల నియోజకవర్గం చిత్రంతో ప్రేక్షకుల హృదయాల్లో గిలిగింతలు పెట్టేందుకు సిద్దమవుతున్నది. ఈ సినిమా యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కృతి శెట్టి ఫస్ట్ లుక్ వివరాల్లోకి వెళితే..

మాచర్ల నియోజకవర్గంలో కృతిశెట్టి

మాచర్ల నియోజకవర్గంలో కృతిశెట్టి

మాచర్ల నియోజకవర్గం మూవీలో కృతిశెట్టి ఫస్ట్ లుక్ విషయానికి వస్తే.. గతంలో ఎన్నడూ లేనంతగా అందంగా కనిపించింది. పసుపు పచ్చని డ్రెస్..ముఖానికి స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని కళ్లతో కవ్విస్తూ కనిపించింది. అలాగే చేతిలో కాఫీ కప్పుతో వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ స్వాతి పాత్రతో ఆలరించడానికి సిద్దమైంది. ఈ ఫస్ట్ లుక్‌తో నితిన్‌తో కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయిందనే సంకేతాలు కృతిశెట్టి లుక్ ఇచ్చింది.

బ్లాక్‌బస్టర్‌పై కన్నేసిన నితిన్

బ్లాక్‌బస్టర్‌పై కన్నేసిన నితిన్


కొద్దికాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్ ప్రస్తుతం భారీ బ్లాక్‌బస్టర్‌పై కన్నేశాడు. ఇప్పటికే మాచర్ల నియోజకవర్గం చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు, సినీ వర్గాల్లో మంచి రిపోర్టు నెలకొని ఉంది. రాజకీయం, ఫ్యాక్షన్ అంశాలతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్టు టాక్ నెలకొన్నది. ఎంఎస్ రాజశేఖరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి స్వయంగా నిర్మిస్తుండటం తెలిసిందే.

ఐపీఎస్ సిద్దార్త్ రెడ్డిగా నితిన్

ఐపీఎస్ సిద్దార్త్ రెడ్డిగా నితిన్

మాచర్ల నియోజకవర్గం చిత్రంలో సిద్దార్థ్ రెడ్డి పాత్రలో ఐపీఎస్ ఆఫీసర్‌గా విభిన్నమైన పాత్రలో నటించారు. సముద్రఖని ఈ సినిమాలో విలన్‌గా తన విలక్షణ నటనను చాటుకోబోతున్నారు. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, మామిడాల తిరుపతి డైలాగ్ రైటర్‌గా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

క్యాథరీన్ త్రెసా, అంజలి గ్లామర్ పంట

క్యాథరీన్ త్రెసా, అంజలి గ్లామర్ పంట


యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా రూపొందే మాచర్ల నియోజకవర్గం చిత్రంలో గ్లామర్ పాళ్లు పుష్కలంగా గుప్పించారు. క్యాథరీన్ త్రెసా మరో హీరోయిన్‌గా గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నది. అలాగే మరో గ్లామర్ తార అంజలి స్పెషల్ సాంగ్‌లో రారా రెడ్డి అంటూ అందాలను ఆరబోసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే రారా రెడ్డి పాట రీల్స్‌తోపాటు, సోషల్ మీడియాలోను వైరల్ అయ్యింది.

మాచర్ల నియోజకవర్గంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

మాచర్ల నియోజకవర్గంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు


నటీనటులు: నితిన్, కృతిశెట్టి, క్యాథరీన్ త్రెసా, సముద్రఖని, అంజలి, సముద్రఖని తదితరులు
రచన, దర్శకత్వం: ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి
నిర్మాత: సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
సమర్పకుడు: రాజ్ కుమార్ ఆకెళ్ల
మ్యూజిక్: మహతి స్వరసాగర్
డీవోపీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డైలాగ్: మామిడాల తిరుపతి
ఫైట్స్: వెంకట్
బ్యానర్: శ్రేష్ట మూవీస్
పీఆర్వో: వంశీ శేఖర్
రిలీజ్: 2022-08-12

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X