తేడా వస్తే చేయి చేసుకునే దర్శకుడి చేతిలో పడిన ఉప్పెన బ్యూటీ.. ఫస్ట్ టైమ్ ఆ హీరోతో..

ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టి ఆ తర్వాత గ్యాప్ లేకుండా సౌత్ ఇండస్ట్రీ లో బిజీగా మారిపోతోంది. కేవలం యువ హీరోలతో మాత్రమే కాకుండా సీనియర్ హీరోలతో కూడా జోడి కట్టేందుకు ఈ బ్యూటీ ఆసక్తిని చూపిస్తోంది. వీలైనంతవరకు తన పాత్ర హైలెట్ అయ్యే విధంగా సినిమా కథలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ బ్యూటీ ఒక కఠినమైన దర్శకుడి చేతిలో పడబోతునట్లు సమాచారం.

ఆ దర్శకుడు ప్రతి షూటింగ్లో కూడా ఎవరో ఒకరిని కొట్టే వరకు ఊరుకోడు అని తమిళ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. చాలా కోపంగా ఉంటాడు అని కూడా చెబుతుంటారు. ఇక ఆ దర్శకుడు ఎవరు ఆ సినిమాలో నటించే హీరో ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

మొదటి సినిమాతోనే బిగ్ హిట్

మొదటి సినిమాతోనే బిగ్ హిట్

మొదటి సినిమా ఉప్పెనతో కృతి శెట్టి తెలుగు ఇండస్ట్రీ లో మర్చిపోలేని బాక్సాఫీస్ హిట్ ను సొంతం చేసుకుంది. ఆమెతో పాటు హీరో వైష్ణవ తేజ్ కు కూడా మొదటి సినిమా కావడంతో ఈ జంట ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీ ఆకర్షించింది. అయితే ఆ సినిమా విడుదల కాకముందే ఇద్దరు కూడా ఇతర సినిమాల్లో మంచి అవకాశాలు అందుకోవడం విశేషం. ముఖ్యంగా కృతి శెట్టి అయితే ఒక్కసారిగా తన పారితోషికాన్ని కూడా పెంచేసింది.

అందరి ఫోకస్ అమెపైనే..

అందరి ఫోకస్ అమెపైనే..

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అయితే ఓ వర్గం హీరోలకు సరైన హీరోయిన్స్ దొరకడం లేదు అనే వాదన వినిపిస్తోంది. అలాగే నటించిన హీరోయిన్స్ తో కూడా మరోసారి నటించడానికి మరికొందరు ఆసక్తి చూపించడం లేదు. ఇక అందరి ఫోకస్ ప్రస్తుతం బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టి పైన పడింది ఇక ఈ బ్యూటీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటూ మంచి బాక్సాఫీస్ హిట్స్ అందుకునే ప్రయత్నం చేస్తోంది.

రెమ్యునరేషన్ ఎంతంటే..

రెమ్యునరేషన్ ఎంతంటే..

వీలైనంత వరకు ప్రతి సినిమాలో కూడా తన పాత్ర హైలెట్ అయ్యే విధంగా కృతి శెట్టి చాలా జాగ్రత్తగా కథలను సెలెక్ట్ చేసుకుంటుంది అనే చెప్పాలి. కథ ఏమాత్రం నచ్చకపోయినా కూడా ఆ సినిమాలో స్టార్ హీరో నటిస్తున్నాడు అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈ బ్యూటీ నచ్చకపోతే వెంటనే రిజెక్ట్ చేస్తోందట. ఇక అమ్మడికి ప్రస్తుతం కోటికి పైగానే పారితోషికం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

తేడా వస్తే కొట్టే దర్శకుడితో..

తేడా వస్తే కొట్టే దర్శకుడితో..

మొదటిసారి కృతి శెట్టి ఒక కఠినమైన దర్శకుడి చేతిలో పడ్డట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో హీరో సూర్య నటిస్తుండడంతో కృతి శెట్టి మొదట కొంత ఇంట్రెస్ట్ చూపించి దర్శకుడు చెప్పిన కథ కూడా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతా బాగానే ఉంది కానీ ఆ దర్శకుడు మాత్రం తేడా వస్తే నటీనటులను పై చాలా కొప్పాడతాడు అని, చాలా సార్లు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని తమిళ నటులే ఓపెన్ గా చెప్పేశారు.

Recommended Video

Krithi Shetty Speech | Aa Ammayi Gurinchi Meeku Cheppali | Filmibeat Telugu
హీరోలను కూడా కొట్టాడు..

హీరోలను కూడా కొట్టాడు..

ఆ దర్శకుడు మరెవరో కాదు. శివ పుత్రుడు, వాడు వీడు వంటి సినిమాలను తెరకెక్కించిన బాల. ఈ రోజు సూర్య, విక్రమ్ మంచి నటులు కావడానికి కారణమైన దర్శకుడు బాల త్వరలో సూర్యతో చేయబోయే సినిమా లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించబోతున్నట్లు సమాచారం.

ఇక స్టార్ హీరోలు కూడా ఈ దర్శకుడి చేతిలో దెబ్బలు తిన్న వేరే. కాకపోతే దర్శకుడు నటన కోసం వారిని అప్పుడప్పుడు అలా ప్రయోగాలు చేస్తుంటాడు అని చెబుతుంటారు. మరి అలాంటి దర్శకుడితో కృతి శెట్టి లాంటి సున్నితమైన అమ్మాయి ఎలా కొనసాగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X