ఘనంగా కృతి కర్బందా హల్దీ వేడుకలు.. అందం కోసం పసుపుకు బదులుగా ఏం రాశారో తెలుసా?
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ కృతి కర్బంద గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్న జంటల్లో ఈమె కూడా ఒకరు. ఇప్పటికే పెళ్లై విడాకులు తీసుకున్న ఓ వ్యక్తిని ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకోబోతుంది. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తాజాగా హల్దీ వేడుకలు చేసుకుంది. ఘనంగా జరిగిన ఈ వేడుకల్లో కృతితో పాటు ఆమె ప్రియుడు పుల్‌కిత్ సామ్రాట్ చాలా అందంగా కనిపిస్తున్నారు. అయితే పెళ్లిలో వీరి అందం ద్విగిణీకృతం కావడం కోసం.. హల్దీ వేడుకల్లో పసుపుకు బదులుగా వేరే వాటిని రాశారు. అయితే ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన కృతి కర్బంద.. తెలుగుతో పాటు కన్నడలోనూ పలు సినిమాలు చేసింది. బోణీ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈమెకు మొదట నిరాశే ఎదురైంది. కానీ ఆ తర్వాత మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, త్రీడీ వంటి చిత్రాల్లో నటించి మెప్పించే ప్రయత్నం చేసింది. పవన్ కల్యాణ్ తో కలిసి తీన్మార్ చిత్రంలో నటించి మెప్పించింది. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాగలిగింది కానీ అనుకున్న స్థాయిలో హిట్లు కొట్టలేకపోయింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయిందీ దిల్లీ భామ.

అక్కడే వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్తుంది కృతి. అయితే కెరియర్ లో సక్సెస్ తో ముందుకు వెళ్తున్న ఈమె పర్సనల్ లైఫ్ లో కూడా మరో అడుగు ముందుకు వేయబోతుంది. ముఖ్యంగా బాలీవుడ్ కు వెళ్లాకా.. ఓ అబ్బాయితో ప్రేమలో పడ్డ కృతి.. అతడినే పెళ్లి చేసుకోబోతుంది. బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్‌తో ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈమె ఎట్టకేలకు పెళ్లాడబోతుంది. అయితే ఇప్పటికీ వీరిద్దరి నిశ్చితార్థం ఫొటోలు వైరల్ కాగా తాజాగా వీరి హల్దీ వేడుకలు జరిగాయి.
ఆ ఫొటోలను కృతి కర్బందానే నేరుగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా పోస్ట్ చేసింది. అందులో అదిరిపోయే ఔట్ ఫిట్లలో కనిపిస్తున్న కృతి, పుల్కిత్ లు చాలా స్పెషల్ గా హల్దీ వేడుకలు చేసుకున్నారు. ముఖ్యంగా అందంగా ముస్తాబై వచ్చి కూర్చున్న ఈ జంట.. పెళ్లిలో మరింత అందంగా కనిపించేందుకు బాగానే ప్లాన్ చేసుకున్నారు. అందుకే హల్దీ వేడుకల్లో పసుపుకు బదులుగా ముల్తానీ మట్టిని రాసుకుంటూ కనిపంచారు. కేవలం మొహంతో పాటు ఒళ్లంతా ముల్తానీ మట్టి రాసుకున్న వీరు.. అలాగే ఒకరినొకరు కిస్ చేసుకున్నారు.
కృతి షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. హల్దీతో పాటు మెహందీ వేడుకలు కూడా జరిగినట్లుగా అర్థం అవుతుంది. ఒళ్లంతా ముల్తానీ మట్టి రాసుకున్న ఈ జంట ఆ తర్వాత స్మిమ్మింగ్ పూల్ లోకి దిగి మరీ స్నానాలు చేశారు. ఆ తర్వాత అదిరిపోయే పాటలకు స్టెప్పులు వేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. అలాగే పెళ్లిలో మరింత అందంగా, బ్రైట్ గా కనిపించడానికి ముల్తానీ మట్టి రాసుకున్నామని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











