Prabhas తో డేటింగ్, పెళ్లి.. మనసులో మాట చెప్పిన కృతిసనన్
బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ కెరీర్ ప్రస్తుతం టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నది. హిందీ సినిమా పరిశ్రమలో భారీ ప్రాజెక్టులు ఆమెను పలకరిస్తున్నాయి. ఆమె నటించిన షెహజాదా సినిమా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఇంకా ఆది పురుష్ లాంటి హిస్టారికల్ మూవీ రిలీజ్‌కు సిద్దమవుతున్నది. అయితే ఆదిపురుష్ సినిమా షూటింగులో ప్రభాస్‌తో ప్రేమలో పడిందనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. ఆ వార్తలపై కృతిసనన్ స్పందిస్తూ..

కృతిసనన్, ప్రభాస్ రిలేషన్‌పై
ఆదిపురుష్ సినిమా షూటింగు జరుగుతున్న సమయంలో కృతిసనన్, ప్రభాస్ మధ్య బలమైన బంధం ఏర్పడింది. వారిద్దరికి ఒకరంటే మరొకరు ఆకర్షణ, ప్రేమ ఉంది. ముంబైలో వారిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దాంతో ఒక్కసారిగా ప్రభాస్, కృతిసనన్ డేటింగ్‌పై రకరకాల ఊహానాలు మీడియాలో కొత్తగా పుట్టుకొస్తున్నాయి.

కృతిసనన్ రియాక్షన్ ఏమిటంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో డేటింగ్ వ్యవహారంపై వార్తలు వైరల్ అవుతుండటంతో ఇటీవల తన ఇన్స్‌టాగ్రామ్‌లో కృతిసనన్ స్పందించింది. ప్రభాస్‌తో డేటింగ్ వ్యవహారంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే. ఇందులో ఎలాంటి నిజం లేదు. కాబట్టి ఇలాంటి వార్తలను ప్రోత్సహించకండి అని కృతిసనన్ క్లారిటీ ఇచ్చింది. ఇక ముందు ఇలాంటి వార్తల గురించి ఫోకస్ పెట్టకండి అంటూ సూచన చేసింది.

మా పెళ్లి డేట్ కూడా ప్రకటించేసి..
ప్రభాస్‌కు నాకు మధ్య ప్రేమ లేదు. పీఆర్ ప్రచారం లేదు. ఇలాంటి వార్తలకు అదుపు ఉండదు. ఎక్కడ పుడుతాయో.. ఎక్కడ ముగుస్తాయో తెలియదు. మా ఇద్దరి పెళ్లి గురించి డేట్ కూడా ఓ వెబ్‌సైట్ ప్రకటించేసింది. ప్రభాస్‌తో నా పెళ్లి వార్త, డేటింగ్ వార్తలో ఎలాంటి నిజం లేదు. కాబట్టి ఈ వార్తకు ఇంతటితో పుల్‌స్టాప్ పెట్టండి అని కృతిసనన్ అన్నారు.

జూన్ 16వ తేదీన ఆదిపురుష్
ఆదిపురుష్ సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు టీ సిరీస్, రెట్రోఫైల్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఓం రావత్ దర్శకుడు. ఈ చిత్రం జూన్ 16వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది. రామాయణం కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నారు. సైఫ్ ఆలి ఖాన్ రావణుడిగా నటిస్తుండగా, సీత క్యారెక్టర్‌లో కృతిసనన్ నటించింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కృతిసనన్ కెరీర్ ఇలా..
ఇక కృతిసనన్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. గతేడాది బచ్చన్ పాండే, హీరోపంతి2, భేడియా చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆదిపురుష్, గణపత్ చిత్రాల్లో నటిస్తున్నది అలాగే ఇంకా పేరుపెట్టని బాలీవుడ్ సినిమాలో కూడా నటించేందుకు సిద్దంగా ఉంది. ఇంకా పలు ప్రాజెక్టులు లైనప్‌లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











