Adipurush: ప్రభాస్ గురించి అందరూ చెప్పేది అబద్ధం.. హీరోయిన్ కృతి సనన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి సనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. అప్పట్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరాంగి దోచెయ్ మూవీ తర్వాత తెలుగు తెరకు కనుమరుగైంది.
వన్ నేనొక్కడినే మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా ఈ ముద్దుగుమ్మ మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఇప్పటివరకు హిందీలో హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటి ఆదిపురుష్ మూవీతో తెలుగులోనూ అలరించనుంది. ఇక తాజాగా జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది కృతి సనన్.

నటీనటులు: ఆది పురుష్ మూవీ రాముడి కథతో రామాయణం ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, సీతగా కృతి సనన్ నటించారు. ఇక పవర్ ఫుల్ హనుమంతుడి పాత్రలో దేవదత్తా, లక్ష్మణుడిగా బాలీవుడ్ హీరో సన్నీ సింగ్ చేశారు. ఈ సినిమాను ప్రముఖ హిందీ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కించారు.

తారకరామ స్టేడియం: ఆదిపురుష్ సినిమాను భూషణ్ కుమార్, అనిల్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించగా.. తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్, సాంగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ కు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా తిరుపతిలో తారకరామ స్టేడియంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

నల్ల చీరలో కృతి: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు ముఖ్య అతిథిగా చిన జీయర్ స్వామి విచ్చేశారు. డైరెక్టర్ ఓం రావత్, ప్రభాస్, కృతి సనన్, సన్నీ సింగ్ పాల్గొన్నారు. ఈ వేడుకలో బ్లాక్ సారీలో ఎంతో అందంగా కృతి సనన్ దర్శనం ఇచ్చింది. అలాగే ఇందులో ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటి.

ప్రత్యేకంగా నిలుస్తుంది: "నా కెరీర్ తెలుగులోనే మొదలైంది. 9 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేస్తున్నాను. జానకి పాత్ర చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టం. అందుకు ఓం రావత్, ప్రభాస్ లకు ధన్యవాదాలు. నిజానికి ఆ సీత పాత్రే నన్ను ఎంచుకుందని నేను భావిస్తున్నాను. నా జీవితంలో ఆదిపురుష్ ప్రత్యేకంగా నిలిచిపోతుంది" అని కృతి సనన్ తెలిపింది.

అంతా నిశబ్ధంగా: "సాధారణంగా సినిమా సెట్స్ లో గోలగోలగా ఉంటుంది. కానీ ఆదిపురుష్ సెట్లో ఒక ప్రశాంతత వాతావరణం ఉంది. రామాయణం చేస్తున్నామన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండేది. అందుకే నిశబ్దంగా ఉండేవారు. ఆ వాతావరణం నాకు ఎంతగానో నచ్చింది" అని కృతి సనన్ పేర్కొంది. తర్వాత ప్రభాస్ గురించి చెప్పమని హీరోయిన్ కృతిని యాంకర్ ప్రదీప్ కోరాడు.

మరొకరు చేయలేరు: "ప్రభాస్ స్వీట్ అండ్ కైండ్ పర్సన్. ఆయన పెద్దగా మాట్లాడరు అని అందరూ అంటారు. కానీ అది నిజం కాదు. ప్రభాస్ చాలా బాగా మాట్లాడతారు. ఆయనకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇది అందరికి తెలిసిందే. ఆయన కళ్లలో ఓ ప్రశాంతత ఉంటుంది. రాఘవుడు పాత్రను ప్రభాస్ తప్ప మరొకరు చేయలేరు" అని కృతి సనన్ చెప్పుకొచ్చింది. ఇక ప్రభాస్, కృతి సనన్ మధ్య లవ్ ఎఫైర్స్ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











