జిమ్ లో పిచ్చెక్కిస్తున్న కృతి.. మీరు ఎప్పుడూ ఇలాంటి హాట్ వర్కౌట్ చూసి ఉండరు!
మహేష్ బాబు వన్..నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ భామ కృతిసనన్. ఆ తరువాత నాగచైతన్యతో కలిసి దోచెయ్ సినిమాలో నటించినా పెద్దగా అవకాశాలు దక్క లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్రేజ్ సంపాదించింది. తాజాగా ఈ భామ షేర్ చేసిన హాట్ వర్కౌట్ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే

మహేష్ తో ఎంట్రీ
కృతిసనన్ 2014లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 1 నేనొక్కడినే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. మహేష్ బాబు సరసన జర్నలిస్ట్ పాత్రలో నటించిన ఈ భామ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో పెద్దగా పేరు అయితే తెచ్చుకోలేక పోయింది. అయితే రెండో అవకాశంగా ఆమెకు హిందీలో హీరో పంటి అనే సినిమా అవకాశం దక్కింది.

బాలీవుడ్ కి వెళ్లి
అలా ఈ భామ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా ఆమెకు పెద్దగా పేరు తెచ్చి పెట్టలేకపోయింది. అయితే తెలుగులో మళ్లీ ఆమెకు దోచేయ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. నాగచైతన్య సరసన ఆమె హీరోయిన్ గా నటించగా ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.

తెలుగు కలిసి రాకపోవడంతో
ఇక తెలుగులో కలిసి రాదు అని భావించిన ఈ భామ బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయి అక్కడ దాదాపుగా ఒక 12 సినిమాలు చేసింది. బాలీవుడ్ లో ఆమె అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాలతోపాటు పలు సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ అయిపోయింది.

బాలీవుడ్ లో బిజీ
ఆమె బాలీవుడ్ లో చివరిగా చేసిన రెండు సినిమాలు పూర్తి అయి రిలీజ్ కోసం సిద్ధంగా ఉండగా మరో రెండు సినిమాలు ఒకటి షూటింగ్ దశలో ఒకటి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇక ఈ భామ ప్రభాస్ ఆదిపురుష్‌లో సీత పాత్రలో నటించనుంది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఆ మధ్య విడుదలైంది.
Recommended Video

జిమ్ లో హాట్ షో
ఇక ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ఇస్తూ ఉండే ఈ భామ హాట్ షో చేయడం కాస్త తక్కువే. కానీ ఈ భామ తాజాగా హాట్ వీడియో ఒకదానిని షేర్ చేసింది. జిమ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియో షేర్ చేయడంతో జిమ్ డ్రెస్ లో రచ్చ రేపుతోంది. తనకు బద్ధకం ఎక్కువ అని చెబుతూనే హాట్ షో చేసేసింది ఈ భామ.


Click it and Unblock the Notifications











