Kriti Sanon 1 నేనొక్కడే టైంలో నాతో మహేష్‌బాబు అలా.. తోడేలు ఈవెంట్‌లో కృతిసనన్ హాట్ కామెంట్

బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు వరుణ్‌ ధవన్‌, కృతిససన్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం భేదియా (Bhediya). ఈ చిత్రం తెలుగులో తోడేలు (Thodelu) టైటిల్‌తో రిలీజ్ అవుతున్నది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రం నవంబర్ 25న థియేటర్లలో విడుదలవుతున్న నేపథ్యంలో మేకర్స్ తెలుగు ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా కృతిసనన్ మాట్లాడుతూ.

 తెలుగులో మూడో సినిమా

తెలుగులో మూడో సినిమా

నా కెరీర్ తెలుగులోనే ప్రారంభమైంది. నా మొదటి సినిమా మహేష్ బాబుతో 1 నేనొక్కడే సినిమాలో నటించాను. టాలీవుడ్‌లో నాకు ఎలాంటి గుర్తింపు లేని సమయంలో.. నాకు ఇక్కడ ఎవరు తెలియని సమయంలో నాకు తెలుగు ప్రేక్షకులు, ప్రతీ ఒక్కరు బాగా ఆదరించారు. నా కెరీర్‌లో టెక్నికల్‌గా ఇది తెలుగులో మూడో సినిమా. ఈ సినిమాకు కూడా సపోర్ట్ అందిస్తారని భావిస్తున్నాను అని కృతిసనన్ చెప్పారు.

అల్లు అరవింద్‌తో రెండో సినిమా

అల్లు అరవింద్‌తో రెండో సినిమా

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తోడేలు (Bhediya). సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే అరవింద్ గారితో అల వైకుంఠపురంలో సినిమా రీమేక్ షెహజాదే సినిమాలో నటిస్తున్నాను. అయితే ఇప్పటి వరకు ఆయనను కలువలేదు. తోడేలు సినిమా ప్రమోషన్‌లోనే మొదటిసారి కలుసుకొన్నాను. తోడేలు ప్రమోషన్‌ కోసం హైదరాబాద్ రావడం చాలా హ్యాపీగా ఉంది అని కృతిసనన్ అన్నారు.

 మహేష్ బాబు గురించి

మహేష్ బాబు గురించి


1 నేనొక్కడినే సినిమాలోని ఆ తుజో మోగ్ కోర్తా పాటకు డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. 1 నేనొక్కడినే సినిమాకు ముందు నేను ఏ సినిమాలో కూడా నటించలేదు. అయితే మహేష్ బాబు నాకు బాగా సపోర్ట్ చేశారు. నాకు లవ్లీ సహ నటుడు. చాలా కూల్‌గా, రిలాక్స్‌గా ఉంటారు. 1 నేనొక్కడినే సినిమాకు నా హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంది అని కృతిసనన్ అన్నారు.

తోడేలు సినిమా కోసం

తోడేలు సినిమా కోసం


తోడేలు (Bhediya). సినిమాలో నటించడం చాలా మంచి అనుభూతులు ఉన్నాయి. ఈ సినిమా కోసం అరుణాచల్ ప్రదేశ్‌కు వెళ్లాం. వాతావరణం అద్బుతంగా ఉంది. దేశానికి సరిపడే ఆక్సిజన్ అక్కడి నుంచే వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్‌కు వెళ్లడం అదే మొదటిసారి. ఈ సినిమా విభిన్నమైన చిత్రం. ఈ చిత్రంలో ఇప్పటి వరకు పోషించని పాత్రను పోసిస్తున్నాను. జంగిల్ బుక్, లయన్ కింగ్ లాంటి సినిమాలకు వీఎఫ్ఎక్స్ అందించిన కంపెనీ ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ అందించారు అని కృతిసనన్ చెప్పారు.

ప్రభాస్ అంటే నాకు ఇష్టం

ప్రభాస్ అంటే నాకు ఇష్టం

టాలీవుడ్‌లో నాకు నచ్చిన హీరో డార్లింగ్ ప్రభాస్. మీ అందరికి నచ్చిన హీరోనే నాకు నచ్చాడు. ఇటీవల కాలంలో పుష్ప, RRR సినిమాలు బాగా నచ్చాయి. నేను నటించిన ఆదిపురుష్ సినిమా కోసం చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను అని కృతిసనన్ చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X