‘నిర్మాతల కన్ను మా మీదే... సెట్‌లో హీరోయిన్లను అలా చెక్ చేయించి’
అన్ని రంగాలతో పాటు చిత్ర పరిశ్రమలోనూ స్త్రీ, పురుషులు దూసుకెళ్తున్నారు. హీరోల మాదిరిగానే నటన, ఫైట్స్, డ్యాన్స్‌తో సినిమాను ఒంటి చేత్తో మోస్తున్నారు. టైమింగ్స్‌తో పని లేకుండా రేయింబవళ్లు కష్టపడుతున్నారు. కానీ పారితోషికం విషయం వచ్చేసరికి హీరోలు వందల కోట్లను దాటిపోతుంటే హీరోయిన్లు మాత్రం ఇంకా సింగిల్ డిజిట్ దగ్గరే ఉన్నారు. కొందరు ముద్దుగుమ్మలు పనిగంటలు, పారితోషికం విషయంలో కొనసాగుతున్న వివక్షను బ్రేక్ చేయాలని ప్రయత్నించి విఫలమై వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సినీ రంగంలో హీరో - హీరోయిన్ల మధ్య వివక్షపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన కృతి సనన్‌కు టాలీవుడ్ ద్వారా వెండితెరకు ఎంట్రీ దొరికింది. 2014లో సుకుమార్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన వన్ నేనొక్కడినే మూవీ ద్వారా కృతి సనన్ హీరోయిన్‌గా అడుగుపెట్టారు. ఆ తర్వాత నాగచైతన్యతో దోచేయ్ మూవీలో నటించారు. అనంతరం టాలీవుడ్‌కు దూరమై పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. బర్ఫీ, లుకా చుప్పి, హౌస్‌ఫుల్ 4, ఆదిపురుష్, క్రూ, దో పట్టి, తేరే ఇష్క్ మైన్ వంటి సినిమాలతో కృతిసనన్ రేంజ్ మారిపోయింది. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా, అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా నిలిచారు కృతి. ప్రస్తుతం కాక్‌టెయిల్ 2 మూవీలో కృతిసనన్ నటిస్తున్నారు.

హీరోయిన్‌గా కాకుండా దో పట్టి మూవీతో నిర్మాతగా మారారు. తన సోదరి నుపుర్ సనన్‌తో కలిసి బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్స్ అనే బ్యానర్‌ను స్ధాపించి పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. అలాగే తన సంపాదనను సినిమాలు, స్కిన్ కేర్, ఫిట్‌నెస్ తదితర రంగాలలో పెట్టుబడులు పెట్టింది. హైఫన్ పేరుతో స్కిన్‌కేర్ బ్రాండ్‌ను ప్రారంభించిన కృతిసనన్.. కేవలం రెండేళ్లలోనే 400 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. ది ట్రైబ్ అనే ఫిట్‌నెస్ సంస్థకు కృతి కో ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీ ఆన్‌లైన్ వర్కౌట్ సెషన్‌లను అందిస్తుంది. సినీ, వ్యాపార రంగాల్లో అద్భుత విజయాలతో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 లిస్ట్‌లో కృతి సనన్ స్థానం సంపాదించారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కృతి సనన్ ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే హాట్ హాట్ ఫోటోషూట్‌లతో కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఉంటారు. ఏ విషయంపై అయినా ముక్కుసూటిగా కుండబద్ధలు కొడుతూ మనసులోని మాటను చెప్పడం కృతిశైలి. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీరంగంలో వివక్షపై కృతిసనన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సినిమా బడ్జెట్‌లో సగభాగం పైనే హీరోలకు వెళ్లిపోతుంది.. ఒకవేళ బడ్జెట్‌లో కోతలు విధించాల్సి వస్తే నిర్మాతల కన్ను హీరోయిన్ల పైనే ఉంటుంది. షూటింగ్ సమయంలోనూ సాధారణ విషయాలకే వివక్ష చూపిస్తుంటారు. హీరోని ఎక్కువసేపు వెయిట్ చేయించకూడదనే ఉద్దేశంతో హీరోయిన్లు రెడీ అయ్యారో లేదో చెక్ చేయిస్తారు. నటిగా తొలిరోజుల్లో నా స్థాయి ఇమేజ్ ఉన్న హీరోకి మంచి కారును పంపి, నాకు మాత్రం సాదాసీదా కారును ఇచ్చారు. సినీరంగంలో పితృస్వామ్యం బలంగా ఉంది.. దీనిని మార్చాల్సిన అవసరం ఉంది. మిమీ చిత్రం తర్వాత తనపై ఉన్న అభిప్రాయం మారింది. సినీ నేపథ్యం లేకపోవడం వల్ల నాకు రావాల్సిన ఎన్నో అవకాశాలు స్టార్ కిడ్స్ దక్కించుకున్నారు. నా జీవితంలో ప్రతీది సులభంగా దక్కలేదు.. నా కష్టంతోనే సంపాదించుకున్నానని కృతి సనన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications


