తల్లిని కావాలని అలా చేశా... మహేశ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోయిన్లు పెళ్లి, పిల్లలకు సంబంధించిన నిర్ణయాలపై ఖచ్చితమైన స్టాండ్‌తో ఉన్నారు. పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? పిల్లల్ని ఎప్పుడు కనాలని ఆల్రెడీ ఓ నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగానే తమ కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. కొందరు కెరీర్ పీక్స్‌లో ఉండగా పెళ్లి వైపు అడుగులు వేయరు, కొందరు మాత్రం ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులోనే జరగాలని, ఇంకొందరు మాత్రం పెద్దవాళ్ల బలవంతం మీద పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా పిల్లల్ని కనడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతిసనన్. ఈ వివరాల్లోకి వెళితే..

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన కృతి సనన్‌ తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారానే సినీరంగ ప్రవేశం చేశారు. 2014లో సుకుమార్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన వన్ నేనొక్కడినే మూవీ ఆమె తొలి సినిమా. మహేశ్ వంటి అందగాడి సరసన బాగానే ఆకట్టుకున్నారు కృతి. ఈ మూవీ తర్వాత నాగచైతన్యతో దోచేయ్ సినిమాలో నటించారు. అనంతరం బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. బర్ఫీ, లుకా చుప్పి, హౌస్‌ఫుల్ 4, ఆదిపురుష్, క్రూ, దో పట్టి, తేరే ఇష్క్ మైన్ వంటి సినిమాలతో కృతిసనన్.. బాలీవుడ్‌లో అగ్రనటిగా దూసుకెళ్లారు. ఇటీవల కాక్‌టెయిల్ 2లో తన అందంతో కుర్రాళ్లను రెచ్చగొట్టారు.

Kriti Sanon revealed she froze her eggs before gaining weight for her role in Mimi Movie

హీరోయిన్‌గా కాకుండా దో పట్టి మూవీతో నిర్మాతగా మారారు. తన సోదరి నుపుర్ సనన్‌తో కలిసి బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్స్ అనే బ్యానర్‌ను స్ధాపించి పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని అనుసరించి తన సంపాదనను సినిమాలు, స్కిన్ కేర్, ఫిట్‌నెస్ తదితర రంగాలలో పెట్టుబడులు పెట్టింది. హైఫన్ పేరుతో స్కిన్‌కేర్ బ్రాండ్‌ను ప్రారంభించిన కృతిసనన్.. ది ట్రైబ్ అనే ఫిట్‌నెస్ సంస్థకు కృతి కో ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు. అలా నటిగానే కాకుండా బిజినెస్‌ఉమెన్‌గానూ ఆమె సక్సెస్ అయ్యారు.

అందరు హీరోయిన్ల మాదిరిగానే కృతిపైనా అనేక రూమర్స్ వచ్చాయి. పలువురు స్టార్స్‌తో ఆమె ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కబీర్ బాహియా, ప్రభాస్‌లతో ఆమె డేటింగ్ చేస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఆల్రెడీ 35 క్రాస్ చేసిన కృతి.. గుడ్‌న్యూస్ ఎప్పుడు చెబుతుందా అని ఆమె అభిమానులు, సన్నిహితులు వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లోని లీడింగ్ హీరోయిన్‌లలో ఒకరిగా ఉన్నందున అప్పుడే కృతి ఈ నిర్ణయం తీసుకోకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

కాగా.. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కృతిసనన్.. మిమి సినిమాలో సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించారు. భవిష్యత్తులో తల్లిని కావడానికి వీలుగా తన అండాలను ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిలో దాచుకున్నట్లు తెలిపారు. నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాలలో ఇది కూడా ఒకటి. మిమి సినిమాలోని పాత్ర కోసం బరువు పెరగాలని దర్శకులు చెప్పారు. ఈ ప్రక్రియ వల్ల శరీరం ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. ఆ సమయంలోనే మీకు వీలైతే ఓ అత్యుత్తమమైన పని ఇదేనని ఒకరు సలహా ఇచ్చారు.

మిమి షూటింగ్‌కు ముందు రెండు నెలలు విరామం దొరికింది, ఆ సమయంలో నేను చేయాల్సినదల్లా బరువు పెరగడమే. దాంతో ఈ సలహాను పాటించాలని అనుకున్నా. హార్మోన్ ఇంజెక్షన్ల వల్ల శారీరకంగా, మానసికంగా అస్తవ్యస్తంగా ఉంటుంది. గర్బిణీల మాదిరిగానే శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి. భవిష్యత్తులో గర్భం దాల్చాల్సి వచ్చినప్పుడు సమస్యలు ఎదురవుతాయి. ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలని, పిల్లలను కనాలనే ఆలోచన లేదు. మనస్పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పుడే తల్లిని అవుతాను తప్పించి నా మీద సమాజం, ఒత్తిడి ఉండకూడదు. ఎగ్ ప్రీజింగ్ అనేది చాలా ఖరీదైన వ్యవహారం.. దానిని భరించగలిగే స్తోమత ఉన్నందుకు అదృష్టవంతురాలిని అని కృతిసనన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఆమె దారిలోనే పలువురు హీరోయిన్లు నడిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X