Kriti Sanon గ్యాంగ్‌స్టర్‌తో కలిసి రొమాన్స్.. ఆదిపురుష్ హీరోయిన్ పిక్ వైరల్
బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా రాణిస్తూ, తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన కృతి సనన్ ఇటీవల కాలంలో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నది. ఇటీవల ఆమె నటించిన మిమి చిత్రంలో గర్బవతిగా కృతి సనన్ ఫెర్ఫార్మెన్స్ సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. అయితే తాజాగా అక్షయ్ కుమార్‌తో కలిసి బచ్చన్ పాండే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్‌లో భాగంగా విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అంతేకాకుండా సినిమాపై అంచనాలు పెరిగే విధంగా చేసింది. ఈ పోస్టర్, బచ్చన్ పాండేలో కృతి సనన్ గురించిన వివరాల్లోకి వెళితే..

మూడేళ్ల తర్వాత అక్షయ్‌తో కలిసి
బచ్చన్ పాండే సినిమా కోసం అక్షయ్ కుమార్, కృతి సనన్ మూడేళ్ల తర్వాత మళ్లీ జత కలిశారు. మూడు సంవత్సరాల క్రితం వీరిద్దరూ హౌస్‌ఫుల్ 4 చిత్రంలో కలిసి నటించారు. అయితే 2019లో హౌస్‌ఫుల్ సినిమాకు దర్శకత్వం వహించిన ఫర్హద్ సమ్జీ ఈ సినిమాకు డైరెక్టర్ కావడం విశేషం. బచ్చన్ పాండే చిత్రం హోళీ పండుగ కానుకగా రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.
క్రూరమైన గెటప్‌లో గాంగ్‌స్టర్‌గా అక్షయ్
బచ్చన్ పాండే చిత్రంలో అక్షయ్ కుమార్ పాత్ర విభిన్నంగా ఉండబోతుందనే విషయం ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు స్పష్టం చేశాయి. ఇటీవల రిలీజ్ చేసిన ఓ పోస్టర్‌లో క్రూరంగా కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. ఈ పోస్టర్‌లో నేను భాయ్‌ని కాదు.. నన్ను గాడ్ ఫాదర్ అంటారు అంటూ ఓ డైలాగ్‌ను పోస్టర్‌లో రుచి చూపించారు.
సినిమా డైరెక్టర్‌గా కృతిసనన్..
ఇక తాజాగా బచ్చన్ పాండే సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయడానికి ముందు మరో ఆసక్తికరమైన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌ను కృతి సనన్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. భగ్వాకు చెందిన బచ్చన్ పాండే.. ముంబైకి చెందిన మైరా (భగ్వా కా బచ్చన్ పాండే.. ముంబై కి మైరా). ఒకరు గ్యాంగ్‌స్టర్, మరొకరు స్పూర్తిని రగిలించే డైరెక్టర్. మా స్టోరి ఏమౌతుందో అంటూ కృతి సనన్ ఆసక్తికరమైన మెసేజ్‌ను షేర్ చేశారు.

బచ్చన్ పాండే ఎలా ఉండబోతుందంటే?
విభిన్నమైన కథ, ఆసక్తికరమైన కథనంతో రూపొందిన బచ్చన్ పాండే చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలా నిర్మించారు. అద్బుతమైన సినిమాటోగ్రఫి, అనుక్షణం గగుర్పాటును కలిగించే యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, సంజయ్ మిశ్రా, అభిమన్యు సింగ్, అర్షద్ వార్సి, జాక్వలైన్ ఫెర్నాండేజ్ నటించారు.
కృతి సనన్ సినిమా కెరీర్ ఇలా
కృతి సనన్ కెరీర్ విషయానికి వస్తే.. బచ్చన్ పాండే సినిమాతోపాటు బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్నారు. కార్తీక్ ఆర్యన్‌తో షెహ్‌జాదా, వరుణ్ ధావన్‌తో కలిసి భేడియా చిత్రంలో నటిస్తున్నారు. అలాగే టైగర్ ష్రాఫ్‌తో గణపత్ అనే చిత్రంలో కూడా నటిస్తూ బీజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











